Maharashtra Protest: శివాజీని అవమానిస్తున్నా పట్టించుకోరా..? మహారాష్ట్రలో MVA కూటమి నేతల ఆందోళన.. భారీ ర్యాలీ..

ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా.. ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర వికాస్ అఘాడి (MVA) ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించింది.

Maharashtra Protest: శివాజీని అవమానిస్తున్నా పట్టించుకోరా..? మహారాష్ట్రలో MVA కూటమి నేతల ఆందోళన.. భారీ ర్యాలీ..
Mva Protest

Updated on: Dec 17, 2022 | 1:39 PM

ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా.. ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర వికాస్ అఘాడి (MVA) ముంబైలో భారీ ర్యాలీ నిర్వహించింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ (మహారాష్ట్ర వికాస్ అఘాడి) చేపట్టిన నిరసన ప్రదర్శనలో శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ పాల్గొన్నారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, శివాజీపై గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మహా వికాస్‌ అఘాడి కూటమి శనివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఏక్‌నాథ్‌షిండే సీఎం పగ్గాలు చేపట్టాక మహారాష్ట్ర ప్రాజెక్ట్‌లన్నీ ఇతర రాఫ్ట్రాలకు తరలిపోయాయని MVA కూటమి నేతలు ఆరోపించారు. మరాఠీలకు ఆరాధ్యదైవమైన శివాజీని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారి పదేపదే అవమానిస్తునప్పటికి బీజేపీ పట్టించుకోవడం లేదని శివసేన అధినేత ఉద్దవ్‌ థాక్రే తీవ్ర విమర్శలు గుప్పించారు.

శివాజీ పాతకాలం మనిషి అని, ఇప్పుడు కొత్త చరిత్ర నడుస్తోందని గవర్నర్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తూ MVA కూటమి ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసన ప్రదర్శలో ఎంవీఏ కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి


శివాజీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. గవర్నర్ కోశ్యారికి వ్యతిరేకంగా మహారాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. థానేలో కూడా ఎంవీఏ కూటమి నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

మహారాష్ట్ర వికాస్ అఘాడి నిరసనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మహారాష్ట్ర ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. వేలాది మంది పోలీసులను మోహరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..