10 లక్షల మందితో రామ్‌నవమి మేళా..!! వాయిదా వేసేదేలేదంటున్న రామ్‌లల్లా మహంత్..

| Edited By:

Mar 19, 2020 | 1:54 PM

ప్రస్తుతం కరోనా వైరస్ పేరు చెబితే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. సామాజిక దూరం అంటూ ఇతరులను ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పలుచోట్ల దీని ప్రభావం రాబోయే పండుగలపై పడుతోంది. ఇప్పటికే మన రాష్ట్రంలో శ్రీరామనవమి కళ్యాణానికి భక్తులకు పరిమితసంఖ్యలోనే ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే.. అయోధ్యలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే శ్రీ రామనవమి మేళా నిర్వహించాలని యోగి సర్కారు నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 2 తేదీ […]

10 లక్షల మందితో రామ్‌నవమి మేళా..!! వాయిదా వేసేదేలేదంటున్న రామ్‌లల్లా మహంత్..
Follow us on

ప్రస్తుతం కరోనా వైరస్ పేరు చెబితే చాలు.. ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. సామాజిక దూరం అంటూ ఇతరులను ముట్టుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పలుచోట్ల దీని ప్రభావం రాబోయే పండుగలపై పడుతోంది. ఇప్పటికే మన రాష్ట్రంలో శ్రీరామనవమి కళ్యాణానికి భక్తులకు పరిమితసంఖ్యలోనే ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే.. అయోధ్యలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే శ్రీ రామనవమి మేళా నిర్వహించాలని యోగి సర్కారు నిర్ణయించింది.

ఈ నెల 25 నుంచి ఏప్రిల్‌ 2 తేదీ వరకు శ్రీ రామ్‌నవమి మేళా నిర్వహించనుంది. ఈ మేళాకు దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ అంచనా వేస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నా.. ఈ రామ్ నవమి మేళా కార్యక్రమానికి వచ్చే భక్తుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మేళాను ఎట్టిపరిస్థితుల్లో కూడా వాయిదావేసేది లేదని రామ్‌లల్లా మహంత్‌ ముఖ్య పూజారి సత్యేంద్ర దాస్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అయోధ్యలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని జిల్లా వైద్యాధికారి వెల్లడించారు.

కాగా.. కరోనా వైరస్ వ్యాప్తిచెందుంతుండటంతో.. రాష్ట్రంలో ఏప్రిల్‌ 2 వరకు విద్యా సంస్థలన్నీ యోగి సర్కారు మూసివేయనుంది.