Burmese Pythons: బ్యారేజ్‌ కోసం తెచ్చిన పైపులో దాగివున్న బర్మా కొండచిలువలు.. ! ఉలిక్కి పడ్డ స్థానికులు, సిబ్బంది..

|

Jan 13, 2023 | 8:52 PM

ఎప్పటి నుంచి ఉన్నాయో ఏమోగానీ, ఇవాళ సిబ్బంది పైపులను పరిశీలించేసరికి వాటిలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి.

Burmese Pythons:  బ్యారేజ్‌ కోసం తెచ్చిన పైపులో దాగివున్న బర్మా కొండచిలువలు.. ! ఉలిక్కి పడ్డ స్థానికులు, సిబ్బంది..
Burmese Pythons
Follow us on

పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం సిలిగురి శివార్లలో భారీ కొండచిలువలు కలకలం రేపింది. సిలిగురి శివారు ఫుల్‌బరీలోని తీస్తా బ్యారేజీ మెకానికల్ యార్డు కార్యాలయంలో రెండు అతి భారీ పైథాన్‌లు భయబ్రాంతులకు గురిచేశాయి. శుక్రవారం ఉదయం రెండు బర్మా కొండచిలువలను గుర్తించారు అక్కడి స్థానికులు.. ఆ పాములను చూడగానే సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు. విషయం వెంటనే స్థానిక అటవీ శాఖ కార్యాలయానికి సమాచారం అందించారు. చుట్టూ పక్కల గ్రామస్తులు, యువకులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు కొండచిలువలను బంధించారు.

ఈ విషయమై ఫారెస్ట్ అధికారి అరిత్రా డే మాట్లాడుతూ.. ఫుల్బరీలోని తీస్తా బ్యారేజీ మెకానికల్ యార్డు కార్యాలయంలో రెండు బర్మా కొండచిలువలు కనిపించాయని సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా పైపులో దాక్కున్న రెండు కొండచిలువలను గుర్తించారు. తీస్తా బ్యారేజ్‌ కోసం తీసుకొచ్చిన పైపులు కొన్ని మిగిలిపోవడంతో వాటిని కార్యాలయం ఆవరణలో భద్రపర్చారు. ఎప్పటి నుంచి ఉన్నాయో ఏమోగానీ, ఇవాళ సిబ్బంది పైపులను పరిశీలించేసరికి వాటిలో రెండు భారీ కొండచిలువలు దర్శనమిచ్చాయి.

ఘటనా ప్రాంతానికి చేరుకున్న అటవీ అధికారులు ఆ పాములు రెండింటిని బంధించారు. అనంతరం అటవీ ప్రాంతంలో వాటిని వదిలేశారు. అటవీ అధికారి అరిత్‌ డే ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..