జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్‌..!

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. భద్రతా దళాలు ఇప్పటివరకు నిర్వహించిన ఆరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 9 నుండి జరుగుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 11) తెల్లవారుజామున ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇప్పుడు భద్రతా దళాలు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.

జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం.. మృతుల్లో జైష్-ఎ-మొహమ్మద్ కమాండర్‌..!
Jammu Kashmir Army Search Operation

Updated on: Apr 12, 2025 | 11:58 AM

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రు ప్రాంతంలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. భద్రతా దళాలు ఇప్పటివరకు నిర్వహించిన ఆరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను తుదముట్టించారు. ఈ ఆపరేషన్ ఏప్రిల్ 9 నుండి జరుగుతోంది. శుక్రవారం(ఏప్రిల్ 11) తెల్లవారుజామున ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఇప్పుడు భద్రతా దళాలు మరో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. మూలాల ప్రకారం, హతమైన ఉగ్రవాదులలో ఒకరు జైష్-ఎ-మొహమ్మద్ టాప్ కమాండర్ సైఫుల్లా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

ఇదిలావుంటే, జమ్మూ కాశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఒక జెసిఓ అమరుడయ్యాడు. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నానికి భారత సైన్యం తగిన సమాధానం ఇచ్చింది. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ తన చివరి శ్వాస వరకు ఉగ్రవాదులతో పోరాడాడు. చొరబాటుదారుల గురించి సమాచారం అందడంతో, భారత సైన్యం సరిహద్దు ప్రాంతంలోని అనేక ప్రదేశాలలో ఆపరేషన్లు నిర్వహిస్తోంది.

ఏప్రిల్ 9 నుండి కిష్త్వార్‌లోని ఛత్రు అడవిలో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. గురువారం కూడా భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. దీని తరువాత, భద్రతా దళాలు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదులు దాక్కున్న సమాచారంతో ఈ ప్రాంతమంతా జల్లడపడుతున్నారు. పారా కమాండోలు, ఆర్మీ, పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది ఇతర ఉగ్రవాదుల కోసం గాలింపులో నిమగ్నమై ఉన్నారు. రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ పూర్వా సింగ్ కూడా ఉగ్రవాదులను అంతమొందించడానికి భద్రతా దళాలతో కలిసి పనిచేస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి, సురక్షితమైన రాకపోకలను నిర్ధారించడానికి, సైన్యం జాతీయ రహదారి 44 (NH-44) పై భద్రతను మరింత పటిష్టం చేసింది. ఈ రహదారి కేంద్రపాలిత ప్రాంతంలోని అనేక ప్రాంతాలను కలుపుతుంది. ఉగ్రవాదులు ఆయుధాలు, వస్తువులను అక్రమంగా రవాణా చేయడానికి చేసే ప్రయత్నాలను అడ్డుకోవడానికి సైన్యం అనేక ప్రధాన చర్యలు తీసుకుంది.

సైన్యం హైవేపై పగలు, రాత్రి గస్తీని పెంచింది. ముఖ్యంగా సున్నితమైన ప్రాంతాలు మరియు ముఖ్యమైన ప్రదేశాలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహకారంతో అనేక చోట్ల మొబైల్ వెహికల్ చెక్ పోస్టులు (MVCPలు) ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాయి. దీనివల్ల ఉగ్రవాదులు ఈ మార్గాన్ని దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది. ఈ చెక్ పోస్టుల వద్ద అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..