లోక్‌సభ సమావేశాలు జరుగుతున్న వేళ నిండు సభలో కలకలం రేగింది. లోక్‌సభలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. నిండు సభలో దూసుకొచ్చిన ఆగంతకులు టియర్ గ్యాస్ లీక్ చేశారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గ్యాస్ లీకైన వెంటనే అక్కడున్న ఎంపీలు భయంతో పరుగులు తీశారు. పార్లమెంట్ పై దాడికి 22ఏళ్లు పూర్తైన వేళ ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. 2001 ఇదే రోజు పార్లమెంట్ పై ఉగ్రదాడి జరిగింది. సభలో పార్లమెంట్ సభ్యులు కూర్చునే బల్లలపైకి ఎక్కి అన్ని చోట్లా తిరుగుతూ ఉన్న విజువల్స్ పార్లమెంట్ సీసీటీవీలో రికార్డ్ అయింది. జీరో హవర్ జరుగుతుండగా ఈ ఘటన జరగడంతో సభలోని సభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకారు నిందితులు. వీరికి సుమారు 20 ఏళ్ల వయసు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగంతకులు షూ నుంచి టియర్ గ్యాస్ వెలువడింది. ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పార్లమెంట్ ఆవరణలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ జరిగిన సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశించారు స్పీకర్ ఓం బిర్లా. దీంతో సభను కాసేపు వాయిదా వేశారు. పరిస్థితి సర్థుమనిగేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. నిందితులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో పార్లమెంట్ ఆవరణ మొత్తం పసుపు వర్ణంతో నిండిపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..