Pulwama Encounter: పుల్వామాలో ఎన్​కౌంటర్.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం

జమ్ము కశ్మీర్‌ పుల్వామా మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Pulwama Encounter: పుల్వామాలో ఎన్​కౌంటర్.. ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం
Encounter

Updated on: Dec 01, 2021 | 11:13 AM

జమ్ము కశ్మీర్‌ పుల్వామా మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. భద్రతా బలగాలు, ఉగ్రమూకలకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని కస్‌బయార్ ప్రాంతంలో బుధవారం ఎన్ కౌంటర్ జరిగింది.  ఓ ఇంట్లో ముష్కరులు నక్కి ఉన్నారన్న సమాచారంతో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి భద్రతాదళాలు. వారిని గమనించిన టెర్రరిస్టులు ఫైరింగ్‌ జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదుల కదలికలతో అప్రమత్తమైంది సైన్యం. స్థానిక ప్రజలను అలర్ట్‌ చేసింది. ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారేమోనని అణువణువూ గాలిస్తున్నారు. ఎన్​కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరింత భద్రతను ఏర్పాటు చేశారు.

మృతుల్లో జైష్​-ఏ-మహమ్మద్(జేఈహెచ్​) ఉగ్రవాదసంస్థకు చెందిన కీలక కమాండర్ యాసిర్​ పరే​ ఉన్నట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్​కుమార్ తెలిపారు. ఐఈడీ అమర్చడంలో యాసిర్ సిద్ధహస్తుడన్నారు. అనేక ఉగ్రవాద కార్యకలాపాల్లో వీరికి ప్రమేయం ఉన్నట్లు వెల్లడించారు.

ఇటీవల కాలంలో జమ్ము కశ్మీర్‌‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెచ్చుమీరాయి. దీంతో సీఆర్ఫీఎఫ్, ఆర్మీ, స్థానిక పోలీస్ బలగాలు ఉమ్మడిగా సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి.  వారం క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ అనుబంధంగా పనిచేస్తున్న ది రెసిస్టెంట్ ఫోర్స్‌కు సంబంధించిన ముష్కరులు హతమయ్యారు.

Also Read: Viral Video: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిస్టర్‌లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..?

 సిరివెన్నెలకు గూగుల్ ఘన నివాళి.. ఎమోషనల్ ట్వీట్..