ఉత్తరప్రదేశ్ లోని మీరట్(Meerut)లో ప్యాసింజర్ రైలులో అగ్ని ప్రమాదం(Fire accident in Train) జరిగింది. సహరాన్ పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ట్రైన్ దౌరాలా స్టేషన్ కు వచ్చిన సమయంలో మంటలు చెలరేగాయి. రైలు బ్రేక్ జామ్ కావడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రైలు ఇంజిన్ సహా రెండు బోగీలు దగ్ధమయ్యాయి. రైలు దౌరాలా(Dowrala) స్టేషన్‌కు చేరుకోగానే ఇంజిన్ కింది నుంచి మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. దీంతో ప్రయాణీకులు అప్రమత్తమై ప్లాట్ ఫాం పైకి పరుగులు తీశారని వెల్లడించారు. రైలులో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిన వెంటనే వెనుక కోచ్‌లలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు రైలు ఇంజిన్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. వెనుక కోచ్‌లకూ అగ్ని కీలలు వ్యాపించాయి. రైల్వే యంత్రాంగం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకోగానే రెండు బోగీలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పారు. అప్రమత్తమైన ప్రయాణికులు రైలులోని ఇతర కోచ్‌లకు ఇంజిన్ తో అనుసంధానమైన పరికరాన్ని తొలగించి, రైలు నుంచి ఇంజిన్ ను వేరు చేశారు.
రైలు వేగంగా వెళ్తున్న సమయంలో శబ్ధంతో పాటు దుర్వాసన వచ్చిందని, దీనికి కారణం ఏమిటో అర్థం కాలేదని ఘటన నుంచి బయటపడ్డ ప్రయాణికులు తెలిపారు. తర్వాత ఒక్కసారిగా సీటు కింద నుంచి పొగలు రావడం మొదలైందన్నారు. ఇంజిన్ నుంచి పొగలు రావడంతో డ్రైవర్‌కు చెప్పేందుకు ప్రయత్నించామని, మాటౌర్ గ్రామం చేరుకునే సరికి పొగ బాగా పెరిగిపోయిందని వివరించారు. దీంతో భయాందోళనకు గురయ్యామని వెల్లడించారు. రైలింజన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని.. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
Uttar Pradesh | Fire broke out in the engine and two compartments of a train going from Saharanpur to Delhi, earlier today at Daurala railway station near Meerut. Cause of the fire is yet to be ascertained. No injuries/casualties reported. pic.twitter.com/WIXv6e0J9f
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 5, 2022
Also Read
Sadha: వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిన సదా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోస్