
నటుడు విజయ్ తమిళగ వెట్రి కలగం పేరుతో పార్టీని పెట్టారు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసి పోటీ చేస్తారని చాలామంది భావించారు. బీజేపీ కూడా విజయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. విజయ్ మాత్రం తాను ఏ పార్టీతో కలిసేది లేదని ఒంటరిగాని పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. పుదుచ్చేరిలో కూడా సింగల్ గానే బరిలో ఉంటూ 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు విజయ్. తాజాగా తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే సారి అభ్యర్థులను ప్రకటించారు. అయితే విజయ్ తాను రెండుచోట్ల పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ రెండు నియోజకవర్గాలు ఏంటి అన్నది కూడా జాబితాలో పేర్కొన్నారు.
తిరుచ్చి ఈస్ట్ నియోజక వర్గంలో క్రిస్టియన్ ఓటర్లు అధికంగా ఉండడం.. అలాగే వెళ్లాలర్ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటం ప్లస్ గా మారింది. విజయ్ కూడా అదే సామాజికవర్గం కావడం క్రిస్టియన్ కన్వెర్టడ్ , ఎస్సీ ఓట్లు అధికంగా ఉండడంతో ఇక్కడ పోటీకి మొగ్గు చూపారు. ఈ నియోజకవర్గం లో డీఎంకే , ఎడిఎంకె అభ్యర్థులతో పోటీపడనున్న టీవీకే విజయ్ గెలుపు పై గట్టి ధీమాలో ఉన్నారు. స్థానికంగా ఉన్న డీఎంకే ఎమ్మెల్యే ఇరుదయరాజ్ క్రిస్టియన్ మిషనరీ నడుపుతున్న బలమైన నేత.. టీవీకే విజయ్ కి డీఎంకే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నా.. గెలుపు మాత్రం మాదే అంటున్నాయి టివికే వర్గాలు. పైగా దక్షిణ తమిళనాడులో ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
చెన్నై సిటీలో ఉన్న పదహారు నియోజకవర్గాలలో ముఖ్యమైన నియోజకవర్గం ఇది. క్రిస్టియన్ ఓట్లు , ఎస్సి ఓట్లు అధికంగా ఉన్న నియోజకవర్గం.. ఈ నియోజకవర్గం లో అన్నాడిఎంకె పోటీలో లేదు.. కూటమిలో ఉన్న పీఎంకే కి కేటాయించారు. డీఎంకే, టీవీకే విజయ్ మధ్యనే పోటీ. ముందు నుంచి విజయ్ పెరంబుర్ నుంచి పోటీ చేస్తారని చర్చ జరుగుతుండగా అన్నాడీఎంకే ఉదేశపూర్వకంగానే అక్కడ తమ పార్టీ అభ్యర్థి కాకుండా మిత్ర పక్షానికి సీటును కేటాయించిందని చర్చ జరుగుతుంది. అన్నాడీఎంకే విజయ్ ని కూటమిలోకి రావాలని ఆహ్వానించింది. అయితే, విజయ్ అందుకు ఒప్పుకోలేదు. రేపటి అవసరాల కోసం విజయ్ తో అన్నాడీఎంకె రహస్య ఒప్పందాలను కుదుర్చుకుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి..