TV9 WITT: AI అయినా, UPI అయినా నియంత్రణలో ఆవిష్కరణలు జరుగుతాయిః అశ్విని వైష్ణవ్

|

Feb 26, 2024 | 3:16 PM

TV9 ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక కాన్ఫరెన్స్ వాట్ ఇండియా థింక్స్ టుడే విశేష స్పందన లభిస్తోంది. రెండవ రోజు ఇన్‌ఫ్రా, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాస్ -3 ఇంప్రెసివ్ సెషన్‌లో కేంద్ర రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూసే దృష్టి స్పష్టంగా ఉంటే ఏ పనైనా చేయొచ్చని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి కూడా ప్రజల కోసం పనిచేయడంపైనే ఉందన్నారు.

TV9 WITT: AI అయినా, UPI అయినా నియంత్రణలో ఆవిష్కరణలు జరుగుతాయిః అశ్విని వైష్ణవ్
Ashwini Vaishnav
Follow us on

TV9 ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వార్షిక కాన్ఫరెన్స్ వాట్ ఇండియా థింక్స్ టుడే విశేష స్పందన లభిస్తోంది. రెండవ రోజు ఇన్‌ఫ్రా, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాస్ -3 ఇంప్రెసివ్ సెషన్‌లో కేంద్ర రైల్వే , ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూసే దృష్టి స్పష్టంగా ఉంటే ఏ పనైనా చేయొచ్చని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి కూడా ప్రజల కోసం పనిచేయడంపైనే ఉందన్నారు. యూపీఐ అయినా, ఏఐ అయినా.. ఇన్నోవేషన్, రెగ్యులేషన్ మధ్య ఎలా బ్యాలెన్స్‌ని మెయింటెయిన్ చేయవచ్చో ప్రపంచానికి చూపించామని ఆయన వెల్లడించారు.

వాట్ ఇండియా థింక్స్ టుడే వేదికపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. నియంత్రణలో ఉంటూనే ఆవిష్కరణలు చేయవచ్చని అన్నారు. గతంలో నియంత్రణలో ఉన్నప్పుడు కూడా ఆవిష్కరణలు చేసామన్నారు. UPI లేదా AI అయినా, నియమాలు, నిబంధనల మేరకే పని చేసామన్నారు. అవి ఈ రోజు విజయవంతమయ్యాయి. ఏ పని చేయాలన్నా పర్యవేక్షణ, నియంత్రణ ఉండటం చాలా ముఖ్యమన్నారు కేంద్ర మంత్రి.

AI సవాళ్ల గురించి మాట్లాడుతూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కొత్త టెక్నాలజీ ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి అతిపెద్ద టాలెంట్ పూల్ ఉంది. కాబట్టి ఇది దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒకరి కోసం ప్రత్యేకంగా ఏ విధానాన్ని రూపొందించలేమన్నారు. దేశ ప్రజలు అందరినీ దృష్టిలో పెట్టుకుని విధానాల రూపకల్పనతో ముందుకెళ్తామన్నారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…