WITT Summit: దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం.. హోం మంత్రి అమిత్ షా ఘనతేనని పారిశ్రామిక ప్రముఖుని కితాబు

దేశంలో శాంతి భద్రతల పరిస్థితి చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడింది. ఇది దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు దోహదపడుతోంది. విదేశీ పెట్టుబడులు భారీగా దేశానికి వస్తున్నాయి. దేశీయ వ్యాపారులు కూడా పారిశ్రమలు నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ దిశగా హోం శాఖ మంత్రి అమిత్ షా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాల పట్ల అందరి ప్రశంసలు అందుతున్నాయి.

WITT Summit: దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం.. హోం మంత్రి అమిత్ షా ఘనతేనని పారిశ్రామిక ప్రముఖుని కితాబు
Poonawalla Fincorp Managing Director Abhay Bhutada

Updated on: Feb 25, 2024 | 7:24 PM

దేశంలో శాంతి భద్రతల పరిస్థితి చరిత్రలో మునుపెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడింది. ఇది దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు దోహదపడుతోంది. విదేశీ పెట్టుబడులు భారీగా దేశానికి వస్తున్నాయి. దేశీయ వ్యాపారులు కూడా పారిశ్రమలు నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. ఈ దిశగా హోం శాఖ మంత్రి అమిత్ షా తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాల పట్ల అందరి ప్రశంసలు అందుతున్నాయి. టీవీ9 నెట్‌వర్క్ నిర్వహించిన ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ వేదికగా ఇదే అభిప్రాయాన్ని ప్రముఖ ఫైనాన్స్ రంగ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ MD అభయ్ భూతాడ వ్యక్తంచేశారు. గత కొన్నేళ్లుగా దేశంలో వ్యాపార అనుకూల వాతావరణం నెలకొంటోందని ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. హోం శాఖ మంత్రి అమిత్ షాపై ప్రశంసల జల్లుకురిపించారు.

పెట్టుబడులు రావాలంటే అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని కల్పించడమే కాకుండా, శాంతి భద్రతల పరిక్షణ, వ్యక్తుల భద్రత చాలా ముఖ్యమని అభయ్ భూతాడ అన్నారు. శాంతి భద్రతలు పటిష్టంగా లేకుండా ఏ దేశమూ పురోగమించదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. దేశంలో భద్రత, శాంతి, సామరస్యం నెలకొనేందుకు దేశ భద్రతతో పాటు దేశ పౌరుల వ్యక్తిగత భద్రత కోసం అమిత్ షా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని.. దీని పట్ల అయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

అలాగే భారత్‌లో డిజిటల్‌గా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చూపిన ప్రత్యేక చొరవను ఆయన అభినందించారు. ఈ దిశగా ప్రధానమంత్రి దార్శనికత భారతదేశాన్ని ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మార్చడానికి దోహదపడిందన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ప్రభుత్వ డిజిటల్ కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. డిజిటల్ చెల్లింపులతో దేశంలోని సామాన్య ప్రజలు కూడా దేశ నిర్మాణంలో తమ పాత్రను పోషిస్తున్నారని చెప్పారు.

న్యూఢిల్లీలోని అశోక హోటల్‌లో ఆదివారం ప్రారంభించిన టీవీ9 గ్లోబల్ సమ్మిట్ ‘వాట్ ఇండియా టుడే థింక్స్’ ఫిబ్రవరి 27 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. TV9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్ ప్రోగ్రాం ప్రారంభ సెషన్‌‌లో స్వాగతోపన్యాసం చేశారు. దేశ, విదేశాలకు చెందిన పలు రంగాల ప్రముఖులు ఈ సమ్మిట్‌లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేయనున్నారు.

లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..