
మన దేశంలో అతిపెద్ద వార్తా సంస్థ అయిన టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ గురువారం ప్రారంభమైంది. గతేడాది జర్మనీలో జరిగిన మొదటి ఎడిషన్‌కు కొనసాగింపుగా దుబాయ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆర్గనైజ్ చేస్తోంది. న్యూస్9 – గ్లోబల్ సమ్మిట్‌లో భారత్ – యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టెక్ దిగ్గజాలు, ప్రముఖులు, ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొననున్నారు. అనేక అంశాల్లో భారత్ – యూఏఈ భాగ్యస్వామ్యంపై దృష్టిపెట్టనుంది టీవీ9 గ్లోబల్ సమ్మిట్. ఈ సందర్భంగా టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ మాట్లాడుతూ.. “మీ అందరినీ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ యూఏఈకి స్వాగతిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. దార్శనిక నాయకులు యూఏఈని అద్భుతమైన దేశంగా మార్చారు. ముందుగా మీకు ఒక దార్శనికత అవసరం.. ఆపై ఆ దార్శనికతను కొనసాగించడానికి మీకు ధైర్యం, నిబద్ధత అవసరం. నేను దుబాయ్‌కి వచ్చిన ప్రతిసారీ నాకు ఇది గుర్తుకు వస్తుంది” అని బరుణ్ దాస్ అన్నారు.
ఆయన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. “1971లో యూఏఈ స్థాపించబడినప్పటి నుండి ఈ దేశాన్ని దార్శనిక నాయకులు నిజంగా అద్భుతమైన దేశంగా మార్చారు. వారి ధైర్యమైన కలలను కొనసాగించడానికి వారు ప్రతి అడుగులోనూ ఎదుర్కొన్న సవాళ్లను నేను ఊహించగలను. అయినప్పటికీ వారు తమ దృఢ సంకల్పాన్ని చూపించారు. నేడు యూఏఈని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలు అసూయపడే విధంగా అభివృద్ధి చెందుతున్న, ప్రగతిశీల ఆధునిక దేశంగా మార్చారు. నేడు ఎమిరేట్స్ ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ముఖ్యమైన దేశం. వ్యాపారం, ఆవిష్కరణ, సంస్కృతికి యూఏఈ ప్రపంచ స్థాయి సురక్షితమైన నగరంగా మారింది. యూఏఈ విజయం అది నిర్మించిన ప్రత్యేకమైన DNAలో ఉంది. అందుకే మేం మా రెండవ అంతర్జాతీయ న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌ను దుబాయ్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నాం.” అని పేర్కొన్నారు.
రెండు దేశాల మధ్య సంబంధాల గురించి బరుణ్ దాస్ మాట్లాడుతూ.. “యూఏఈ అధ్యక్షుడు హిజ్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన నాయకత్వంలో కొత్త శిఖరాలను తాకుతున్న ద్వైపాక్షిక సంబంధాలలో శక్తిని పెంచడం, మా సమ్మిట్ థీమ్ కూడా అదే.. “శ్రేయస్సు, పురోగతి కోసం భారత్-యూఏఈ భాగస్వామ్యం. 2014లో కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 34 సంవత్సరాల తర్వాత యూఏఈని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా నిలిచారు. ఆయన యూఏఈకి ఇస్తున్న ప్రాముఖ్యత చూసి చాలామంది ఆశ్చర్యపోయారు, కానీ ప్రధాని మోదీ నమ్మినట్లుగా.. రెండు దేశాలు పరస్పర శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలో పురోగతిని సాధించడానికి, ఆసియా శతాబ్దపు దార్శనికతను సాకారం చేసుకోవడానికి పరివర్తన ఆర్థిక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
గత 10 సంవత్సరాలుగా యూఏఈ మా సన్నిహిత మిత్రదేశాలలో ఒకటిగా, కీలక వాణిజ్య భాగస్వామిగా మారింది. నేడు ఇది గ్లోబల్ సౌత్‌లో ఇండియాకు స్పెషల్ ఫ్రెండ్‌గా ఉంది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ స్వయంగా మనతో ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యత గురించి పదే పదే మాట్లాడారు. అందులో భాగంగానే నిర్ణయాత్మక క్షణం ఫిబ్రవరి 2022లో భారత్-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈసీఏ) కుదిరింది. ద్వైపాక్షిక వాణిజ్యం అప్పటి నుండి రెట్టింపు అయి 83 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
గత సంవత్సరం భారతదేశాన్ని సందర్శించినప్పుడు CEPA గురించి హిజ్ ఎక్సలెన్సీ చెప్పినది నాకు బాగా గుర్తుంది.. భారతదేశంతో భాగస్వామ్యం మా విదేశాంగ విధానానికి మూలస్తంభం, మా ఆర్థిక వైవిధ్యం, వృద్ధిలో కీలకమైన అంశం. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, శక్తి, సంస్కృతితో సహా అన్ని రంగాలలో ఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచడానికి మేం కట్టుబడి ఉన్నాం అని అన్నారు. గత వారం నేను అబుదాబిలోని స్వామినారాయణ మందిరాన్ని సందర్శించి పూజ్య బ్రహ్మవిహారి స్వామీజీని కలిసే అదృష్టం కలిగింది. స్వామీజీ ఈ రోజు మాతో ఇక్కడ ఉండలేకపోయారు, కానీ ఈ సాయంత్రం US నుండి వర్చువల్‌గా మనతో ప్రసంగిస్తారు. భారత్, యూఏఈ మధ్య బంధం చాలా విలువైనది. ఇది రెండు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తుంది. నేటి గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం కూడా ఇదే. నేను మిమ్మల్ని మరోసారి న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ యూఏఈ ఎడిషన్‌కు స్వాగతిస్తున్నాను. ఈ చొరవలో భాగమైనందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.” అని బరుణ్ దాస్ తన ప్రసంగాన్ని ముగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి