Minister Nitin Gadkari: ‘అగ్నిపథ్’ లక్ష్యం ఉద్యోగం, ఉపాధి.. యువత సరిగ్గా అర్థం చేసుకోవాలన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Nitin Gadkari on Agnipath Scheme: భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని యువత సరిగా అర్ధం చేసుకోవాలని..

Minister Nitin Gadkari: అగ్నిపథ్ లక్ష్యం ఉద్యోగం, ఉపాధి.. యువత సరిగ్గా అర్థం చేసుకోవాలన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
Union Minister Nitin gadkari on Agnipath

Updated on: Jun 17, 2022 | 12:38 PM

‘అగ్నిపథ్’ (Agnipath)యోజన చాలా మంచి లక్ష్యంతో తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ స్పష్టం చేశారు. దీని లక్ష్యాన్ని యువత సరిగ్గా అర్థం చేసుకోవాలని వెల్లడించారు. భారతదేశపు నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. దీన్ని యువత సరిగా అర్ధం చేసుకోవాలని.. ఈ స్కీంతో ఎవరి ఉపాధి లాక్కోవడం ఉండదన్నారు. నాలుగేళ్ళ తర్వాత ఉద్యోగం అయిపోతుంది అనుకోవద్దు.. ఆ తరువాత కూడా ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. తప్పుగా అర్ధం చేసుకుని ఆందోళనలు అవసరం లేదని.. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా వ్యతిరేకిస్తాయన్నారు. అందులో భాగంగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు దీనిని అర్థం చేసుకున్న వెంటనే అదే విధంగా దీనిపై నిరసన కూడా ముగుస్తుందన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని, ప్రజాస్వామ్యం ఉన్న చోట ప్రతిపక్షం, అధికార పార్టీ రెండూ ఉంటాయని నితిన్ గడ్కరీ అన్నారు. అధికార పక్షం ఎప్పుడు ఏ పని చేసినా ప్రతిపక్షం ముందు తిరస్కరణపై సమీక్ష జరుగుతుంది. ప్రజాస్వామ్యంలో ఇదంతా జరుగుతుంది. ప్రజాకోర్టులో ఉండే సామాన్యుడే తుది నిర్ణయం తీసుకుంటాడు.

ఇప్పటి వరకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాల ఆధారంగానే ప్రజలు మన విధానాలను నిర్ణయించారు. నితిన్ గడ్కరీ స్పష్టం చేస్తూ అగ్నీపథ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఇది ఉపాధిని తొలగించే ప్రణాళిక కాదని.. ఉపాధిని పెంచే ప్రణాళిక అని మీకు గుర్తు చేశారు. తాను అగ్నీపథ్ పథకాన్ని పూర్తిగా చదివానన్నారు. ఇది చాలా మంచి ప్రణాళిక.. 4 ఏళ్లలో ఎవరి పని అయిపోదు, ముందు ఈ అంశాన్ని బాగా అర్థం చేసుకోవాలి.

జాతీయ వర్తల కోసం

TV9 Network Global Summit Live: ‘అగ్నిపథ్’ యోజన చాలా మంచిది.. టీవీ9 గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి గడ్కారీ వ్యాఖ్యలు..