
భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, పాకిస్తాన్‌కు మొదట మద్దతు ఇచ్చింది టర్కీ(తుర్కియో). దీంతో ఇండియాలో టర్కీపై వ్యతిరేకత పెరిగింది. టర్కీ యాపిల్స్‌ను చిన్న వ్యాపారులు కూడా బహిష్కరించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఆ తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ దాడులకు టర్కీ పాకిస్తాన్‌కు సహాయం చేసింది, వారికి డ్రోన్లు సరఫరా చేసిందని సమాచారం. దీంతో ఇండియాలో బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్ ఊపందుకుంది. అయితే టర్కీ యాపిల్స్‌ను బహిష్కరించడం వల్ల టర్కీకి వందల కోట్ల నష్టం వటిల్లుతున్నట్లు సమాచారం.
2021-22లో రూ.563 కోట్ల విలువైన యాపిల్స్ టర్కీ నుండి భారతదేశానికి దిగుమతి అయ్యాయి. 2022-23లో రూ.739 కోట్ల విలువైన యాపిల్స్, 2023-24లో రూ.821 కోట్ల విలువైన యాపిల్స్ దిగుమతి అయ్యాయి. ఇలా టర్కీ నుండి యాపిల్స్ దిగుమతి పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉన్నా.. ప్రస్తుతం పరిస్థితుల్లో దిగుమతి గణనీయంగా తగ్గింది.
టర్కీ యాపిల్స్ నాణ్యత, తక్కువ ధర కారణంగా భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కానీ ఇటీవలి కాలంలో బహిష్కరణ ఉద్యమం పెరిగింది. దీని కారణంగా డిమాండ్ 50 శాతం వరకు తగ్గింది. బహిష్కరణ కారణంగా పండ్ల వ్యాపారులు ఇప్పుడు కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, వాషింగ్టన్, ఇరాన్, న్యూజిలాండ్ నుండి యాపిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నారు.
దీని కారణంగా టర్కీ భారీ నష్టాలను చవిచూస్తుంది. సీజన్ లేని సమయంలో కూడా భారత మార్కెట్లలో టర్కిష్ యాపిల్స్‌కు డిమాండ్ ఉంటుంది. కానీ, ప్రస్తుతం అంతా కాయ్‌కాట్ టర్కీ అంటూ టర్కీ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడం లేదు, చిన్న వ్యాపారులు కూడా టర్కీ యాపిల్స్‌ను కొనుగోలు చేసి అమ్మడానికి ఆసక్తి చూపించడం లేదు. స్వచ్ఛందంగా వాటిని బాయ్‌కాట్ చేస్తున్నారు. దీంతో టర్కీకి ఈ ఏడాది దాదాపు రూ.821 కోట్ల నష్టం వాటిల్లే అవకావం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.