పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే.. రాజ్యసభలో డిమాండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌

|

Feb 04, 2021 | 4:38 PM

భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞావంతుడు, దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్..

పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందే.. రాజ్యసభలో డిమాండ్‌ చేసిన టీఆర్‌ఎస్‌ ఎంపీ బండా ప్రకాశ్‌
Follow us on

భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞావంతుడు, దివంగత మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆయన ప్రాతినధ్యం వహించిన కాంగ్రెస్‌ పార్టీ కన్నా.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆ డిమాండ్‌ను అవకాశం దొరికినప్పుడల్లా గట్టిగా వినిపిస్తుంది.

తాజాగా పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ సభ్యుడు బండా ప్రకాశ్ రాజ్యసభలో పీవీకి భారతరత్న అంశాన్ని లేవనెత్తారు. పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టాలని, ఓ రహదారికి కూడా ఆయన పేరిట నామకరణం చేయాలని కోరారు.

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చ సమయంలో ఎంపీ బండా ప్రకాశ్ ఈ డిమాండ్‌ చేశారు. దేశం గర్వించ దగ్గ వ్యక్తిని గౌరవించుకోవాల్సిన బాధ్య మనందరిపై ఉందని బండా ప్రకాశ్‌ అన్నారు. తన మేధా సంపత్తితో అనేక సంస్కరణల ద్వారా దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడారు.

 

Read more:

గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సత్యవతి రాథోడ్ సమీక్ష.. అర్హత కలిగిన అందరికీ ప్రమోషన్‌ లభిస్తుందన్న మంత్రి‌