మాకు వంతెన కావాల్సిందే.. పట్టాలపై బైఠాయించిన ప్రజలు

| Edited By:

Aug 12, 2020 | 5:43 PM

తమ గ్రామానికి వంతెన కావాలని డిమాండ్‌ చేస్తూ.. వందలాది మంది ప్రజలు రైల్వే పట్టాలపై బైఠాయించారు. ఈ సంఘటన త్రిపుర రాష్ట్రంలో చోటుచేసుకుంది. నార్త్ త్రిపుర జిల్లాలోని పానీసాగర్..

మాకు వంతెన కావాల్సిందే.. పట్టాలపై బైఠాయించిన ప్రజలు
Follow us on

తమ గ్రామానికి వంతెన కావాలని డిమాండ్‌ చేస్తూ.. వందలాది మంది ప్రజలు రైల్వే పట్టాలపై బైఠాయించారు. ఈ సంఘటన త్రిపుర రాష్ట్రంలో చోటుచేసుకుంది. నార్త్ త్రిపుర జిల్లాలోని పానీసాగర్ గ్రామం వద్ద రైల్వే పట్టాలపై స్థానికులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమ ప్రాంతంలో వంతెన లేని కారణంగా.. నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని.. 2004 నుంచి ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరంతా రైల్వే క్రాసింగ్‌ వద్ద జరిగిన ప్రమాదాల్లోనే ప్రాణాలు విడిచారని తెలిపారు. రైల్వే పట్టాలు దాటేప్పుడు వేగంగా వస్తున్న ట్రైన్స్‌ ఢీ కొట్టడంతో స్థానికులు మరణిస్తున్నారని.. ఇక్కడ లెవల్ క్రాసింగ్‌ వద్ద వంతెన నిర్మిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే స్థానికులు ఆందోనకు దిగారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే