Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టూరిస్ట్ వ్యాన్.. నలుగురు మృతి..

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ వ్యాన్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తేని జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునల్వేలి జిల్లాకు చెందిన టూరిస్టులు ప్రత్యేక వాహనంలో వివాహర యాత్రకు బయలుదేరారు.

Tamil Nadu: తమిళనాడులో ఘోర ప్రమాదం.. లోయలో పడిన టూరిస్ట్ వ్యాన్.. నలుగురు మృతి..
Accident

Updated on: Apr 23, 2023 | 6:40 AM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ వ్యాన్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో నలుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తేని జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరునల్వేలి జిల్లాకు చెందిన టూరిస్టులు ప్రత్యేక వాహనంలో వివాహర యాత్రకు బయలుదేరారు. అయితే, ప్రయాణంలో తేని జిల్లా నుంచి వెళ్తుండగా వారి వ్యాన్ అదుపు తప్పి వంద అడుగుల లోతు గల లోయలో పడిపోయింది.

ఈ ఘటనలో నలుగురు టూరిస్టులు స్పాట్‌లోనే చనిపోగా.. మరికొందరు వ్యానులో చిక్కుకున్నారు. 16 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వ్యానులో 30 మంది ఉన్నారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us