దేశంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రైలు ఢీకొనడం, అగ్ని ప్రమాదాలు ఇలా రకరకాల ఘటనలు చోటు చేసుకోవడం వల్ల ప్రాణ నష్టంతో పాటు భారీ ఆస్తినష్టం కూడా జరుగుతోంది. తాజాగా చెన్నై శివారులోని రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలును మైసూర్-దర్బంగ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఈ ఎక్స్ ప్రెస్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. దీంతో దర్బంగ్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి.
కవరపేటై రైల్వే స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘనట స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి