Traffic Rules: ట్రాఫిక్ పోలీసులు భారతదేశంలో ప్రచారాన్ని నిర్వహిస్తారు: మీరు మీ కారు, బైక్ భారీ హారన్, సైలెన్సర్‌ని ఉపయోగిస్తుంటే ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా చేస్తే మీరు భారీ జరిమానాలు, కేసులు భరించాల్సి వస్తుంది. దీంతో వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ట్వీట్టర్ ద్వారా సమాచారం అందించారు. వాహనాల్లో ప్రెషర్ హారన్, మోడిఫైడ్ సైలెన్సర్‌లను అమర్చే వారికి భారీ జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఢిల్లీలో శబ్ద కాలుష్యాన్ని ఏ మాత్రం సహించేది లేదని తేల్చి చెబుతున్నారు. ఢిల్లీ పోలీసుల చర్యలను ప్రజలు స్వాగతిస్తున్నారు.
ఇంతకుముందు ఢిల్లీలో ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు వారిపై మరింత దృష్టి సారిస్తామని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు ప్రెషర్ హారన్లు, మోడిఫైడ్ సైలెన్సర్‌లను ఉపయోగిస్తారని, శబ్ద కాలుష్యం సృష్టించే వారిపై జరిమానాలు విధిస్తామన్నారు. మోటారు వాహనాల చట్టంలోని రూల్ 39/192 ప్రకారం.. ప్రెషర్ హార్న్ వాడితే రూ. 10,000 వరకు జరిమానా విధించవచ్చు. మీరు నిషేధించబడిన లేదా నిశ్శబ్ద లేని ప్రదేశంలో పదేపదే ఈ హారన్ మోగించినట్లయితే అప్పుడు రూ. 2 వేల జరిమానా చెల్లించాల్సి వస్తుంది.
Starting today, #DelhiTrafficPolice shall be penalising those who use pressure horns and modified silencers in their vehicles.#DelhiMeinShorNahi pic.twitter.com/5z7ZrYaCat
— Delhi Traffic Police (@dtptraffic) August 20, 2022
కొత్త టెక్నాలజీ..
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను చలాన్ చేయడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్‌తో పోలీసులు ఒప్పందం చేసుకోనున్నారు. దీంతో రోడ్లపై అడ్వాన్స్ కెమెరాలు ఉండడంతో వాటి సాయంతో చలాన్ కట్ అవుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. దీని గురించి ఇంగ్లాండ్‌లోని ఒక కంపెనీతో చర్చలు జరుపుతున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి