COVID Vaccine : దేశవ్యాప్తంగా తొలిరోజు వ్యాక్సినేషన్ విజయవంతమైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్టు తెలిపింది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. ఈ రోజు టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పష్టం చేసింది. శనివారం 3,351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని వెల్లడించింది. ఈ రోజు 12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, మరో 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ టీకా వేసినట్టు తెలిపింది.
Total of 1,91,181 beneficiaries vaccinated for #COVID19 on day 1 of the massive nationwide vaccination drive: Ministry of Health & Family Welfare pic.twitter.com/K8RPTInUXf
— ANI (@ANI) January 16, 2021
టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం ప్రకటన విడుదల చేసింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్టు తెలిపింది. మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ అన్ని రాష్ట్రాలు… కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమీక్షించారు.
కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంతో ఉపశమనం లభించినట్లైందని పేర్కొన్నారు. కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఈ టీకాలు సంజీవనిలా దేశం ముందు నిలిచాయని తెలిపారు. కరోనా వైరస్‌కు టీకాలు రూపొందించడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, టీకా పరిశ్రమలు, ట్రయల్స్‌లో పాల్గొన్నవారు తదితరుల సహకారానికి అభినందనలు తెలిపారు.
COVID19 | The healthcare workers in the forward field hospitals of the Army in Arunachal Pradesh were vaccinated today: Indian Army pic.twitter.com/7uvJmuVuRP
— ANI (@ANI) January 16, 2021
త్వరలోనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెడతా… సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా