India Corona Updates: దేశవ్యాప్తగా తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య.. ఎంత మంది మ‌ర‌ణించారంటే..

|

Jun 30, 2021 | 10:00 AM

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 45,951 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

India Corona Updates: దేశవ్యాప్తగా తగ్గుతున్న కరోనా కేసుల సంఖ్య.. ఎంత మంది మ‌ర‌ణించారంటే..
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు దిగివస్తోంది. అయితే నిన్నటితో పోల్చి కాస్త తగ్గుముఖం పట్టడం విశేషం. గ‌డ‌చిన 24 గంట‌ల వ్యవధిలో కొత్తగా 45,951 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. మంగళవారం ఒక్కరోజే 60,729 మంది కోలకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,62,848కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

కాగా, ఆదివారం క‌రోనా నుంచి 2,94,27,330 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇదే స‌మ‌యంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా భారీగా త‌గ్గింది. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనాతో చనిపోయిన 817 మందితో కలిపి మొత్తం క‌రోనా మరణాల సంఖ్య 3,98,454 కు చేరింది. దేశంలో ప్రస్తుతం క‌రోనాకు చికిత్స పొందుతున్న వారిసంఖ్య 5,37,064కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి.

ఇవి కూడా చదవండి: Premajanta suicide: తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య.. కన్నీరు మున్నీరవుతున్న ఇరు కుటుంబాలు