Today Gold Rate In Hyderabad: స్వల్పంగా పెరిగిన బంగారం ధర… నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే…?

| Edited By: శివలీల గోపి తుల్వా

Oct 30, 2023 | 7:41 PM

దేశంలో వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.4700 లాభపడింది. పసిడి సైతం రూ.1100 మేర ధరల్లో పెరుగుదలను నమోదు చేసుకుంది.

Today Gold Rate In Hyderabad: స్వల్పంగా పెరిగిన బంగారం ధర... నేడు 24 క్యారెట్ల బంగారం ధర ఎంతంటే...?
Follow us on

దేశంలో వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. కిలో వెండి ఏకంగా రూ.4700 లాభపడింది. పసిడి సైతం రూ.1100 మేర పెరిగింది.

బంగారం ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. నిన్న హైదరాబాద్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,800 ఉండగా.. నేడు అది రూ.46,810కి పెరిగింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,060కి చేరింది. గత ఏడు రోజులుగా బంగారం ధర గణనీయంగా పెరిగింది. డిసెంబర్ 14 న పది గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గగా.. ఆ తర్వాత రోజుల్లో రూ.50, రూ.110, రూ. 400 చొప్పున పెరిగింది. ఈ మూడు రోజుల్లో రూ.10 తగ్గి.. రూ.20 పెరిగింది. ఈ వారం రోజుల్లో ఓవరాల్‌గా పసిడి ధర రూ.1100 పెరిగింది.

 

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,760గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,810 ఉండగా… 24 క్యారెట్ల ధర 51, 060గా ఉంది. ముంబాయిలో 22 క్యారెట్ల ధర 48,970,కాగా 24 క్యారెట్ల ధర 49,720. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,970 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,410గా నమోదైంది.