Tiger Terror: మనిషి రుచి మరిగిన పెద్ద పులి.. ఇప్పటికే 15 మంది బలి.. మహారాష్ట్ర సరిహద్దులో హడలెత్తిస్తున్న మృగం

|

Sep 22, 2021 | 10:44 AM

పులి మేకను చంపితే పెద్దగా పట్టించుకోం. అదే పులి మనిషిని చంపితే గాబరా పడతాం. కానీ ఆ పులికి మనిషైనా, మేకైనా ఒకటే. మామూలు పులి కాదది, మనిషి రక్తం మరిగిన పులి. మహారాష్ట్ర సరిహద్దులో మరోసారి పెద్ద పులి కలకలం స‌ృష్టించింది.

Tiger Terror: మనిషి రుచి మరిగిన పెద్ద పులి.. ఇప్పటికే 15 మంది బలి.. మహారాష్ట్ర సరిహద్దులో హడలెత్తిస్తున్న మృగం
Tiger Terror
Follow us on

Tiger terror in Maharashtra: పులి మేకను చంపితే పెద్దగా పట్టించుకోం. అదే పులి మనిషిని చంపితే గాబరా పడతాం. కానీ ఆ పులికి మనిషైనా, మేకైనా ఒకటే. మామూలు పులి కాదది, మనిషి రక్తం మరిగిన పులి. మహారాష్ట్ర సరిహద్దులో మరోసారి పెద్ద పులి కలకలం స‌ృష్టించింది. గడ్చిరోలి చంద్రాపూర్‌ ఫారెస్ట్‌లో పులి గజగజలాడిస్తోంది. ఒకరిద్దర్ని కాదు.. ఇప్పటికి 15మందిని చంపేసింది. నెలరోజుల్లో ఏడుగుర్ని చంపి రక్తం తాగేసింది. ఆగస్ట్‌ 15, 19, 25, 31, సెప్టెంబర్ 6, 11, 14.. ఇలా ఐదారు రోజుల గ్యాప్‌లోనే మనుషల్ని చంపుతూ వస్తోంది ఆ పెద్దపులి. మొత్తం 18 గ్రామాల పరిధిలోని ప్రజలకు ఈ మృగం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. బయటకి వస్తే మాటేసిన పులి ఎటువైపు నుంచి ఎటాక్ చేస్తుందో తెలీక ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటున్నారు.

జనం గజగజతో ఫారెస్ట్ సిబ్బంది నిద్రలేచారు. టీమ్‌లుగా విడిపోయి గడ్చిరోలి, చంద్రపూర్ పరిధిలోని ఫారెస్ట్‌లో మ్యాన్ ఈటర్ కోసం గాలిస్తున్నారు. పులి పాదముద్రలు, అది వదిలిన ఆనవాళ్లను బట్టి.. ఇది రెండేళ్ల వయసున్న మృగంగా అంచనాకొచ్చారు. ఆ పులి కోసం ఎక్కడికక్కడ బోన్లు ఏర్పాటు చేశారు. అడవి అంతా సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు. అధునాతన హంటింగ్ వెపన్స్‌తో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు తెలిపారు. స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన దిలీప్, కెమెరా ట్రాప్‌ల సహాయంతో పులిని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ పులి ఒక్క మహారాష్ట్రకే పరిమితం కావడంలేదు. ఇటు, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ బార్డర్‌లోనూ సంచరిస్తున్నట్లు అనవాళ్లు ఉన్నాయని అటవీ అధికారులు తెలిపారు. చంద్రాపూర్‌, గడ్చిరౌలి ఫారెస్ట్ రీజియన్ నుంచే ఆదిలాబాద్, మంచిర్యాలల్లోని అడవుల్లో పులి ఎంటరవుతోంది. గతేడాది ఈ జిల్లాల్లో దాడి చేసిన పులులు వచ్చింది మహారాష్ట్ర నుంచే. ప్రస్తుతం అక్కడ గాలిస్తున్న సిబ్బందికి పులి జాడ చిక్కడం లేదు. అంటే.. ఆ పులి తెలంగాణ పరిధిలోని అడవుల్లోకి వచ్చిందా? ఇదే భయం ఇక్కడ ఫారెస్ట్ సిబ్బందిని అలర్ట్ చేస్తోంది. సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Read Also… ‘అజ్ఞానం గూడు కట్టిన చోటే.. మోసం గుడ్లు పెడుతుంది’ రిపబ్లిక్ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. హిట్ గ్యారంటీ.!