చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన టిబెటన్ యూత్ కాంగ్రెస్

| Edited By:

Jul 10, 2020 | 6:32 PM

జిత్తుల మారి చైనా కేవలం మన భారత దేశంతోనే కాదు.. పొరుగు దేశాలన్నింటితోనే కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే టిబెట్‌ తమ ప్రాంతమే అంటూ.. అక్కడి వారిని అనిచే వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి..

చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన టిబెటన్ యూత్ కాంగ్రెస్
Follow us on

జిత్తుల మారి చైనా కేవలం మన భారత దేశంతోనే కాదు.. పొరుగు దేశాలన్నింటితోనే కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇప్పటికే టిబెట్‌ తమ ప్రాంతమే అంటూ.. అక్కడి వారిని అనిచే వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిబెట్‌కు చెందిన ప్రజలు చైనాకు వ్యతిరేకంగా నిరసనలు తెల్పుతున్నారు. ఇప్పటికే ఇతర యూఎస్‌లో కూడా చైనాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి ఎదుట ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో టిబెటన్ యూత్ కాంగ్రెస్ సభ్యులు చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. చైనా వస్తువులను బహిష్కరించాలంటూ వస్తువులను తగులబెట్టారు. చైనా చొరబాట్లతో పాటు.. మానవ హక్కులను ఉల్లంఘించడం, కరోనా మహమ్మారి విషయంలో విషయాల్ని దాచి పెట్టడాన్ని ఖండిస్తున్నామని టిబెటన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోన్పో ధుండప్‌ తెలిపారు.