ఢిల్లీలో ముగ్గురు మహిళలు రెచ్చిపోయారు. కారును ఆపి ప్రశ్నించినందుకు సెక్యూరిటీ గార్డ్‌పై ఎటాక్ చేశారు లేడీస్. ఈ ఘటన ఇప్పుడు నోయిడాలో రచ్చ రేపుతోంది. వివరాల్లోకెళితే.. ఢిల్లీ ఔట్‌కట్స్ నోయిడాలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌పై మహిళలు దాడి చేయడం వివాదాస్పదమైంది. ఓ హౌసింగ్ సొసైటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఉజ్వల్ శుక్లాపై ఎటాక్ చేశారు ముగ్గురు మహిళలు. అర్ధరాత్రి ఒంటి గంట టైమ్‌లో గార్డు చొక్కా కాలర్ పట్టుకుని చితకబాదారు. అతని తలపై టోపీని తీసేసి గాల్లోకి విసిరి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అక్కడున్న మిగతా సెక్యూరిటీ గార్డ్స్ ఆపేందుకు ప్రయత్నించడంతో మరింత రెచ్చిపోయారు.
సెక్యూరిటీ గార్డుపై దాడి చేయడమే కాకుండా, వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్తా, వైరల్‌గా మారడంతో రౌడీ లేడీస్ నిర్వాకం బయటపడింది. మరోవైపు, బాధితుడు ఉజ్వల్ శుక్లా పోలీసులను ఆశ్రయించడంతో మహిళలపై కేసు నమోదైంది. నిందితులు ముగ్గురూ 30ఏళ్లలోపు మహిళలే. నిందితుల్లో అంజలి తివారీ, కాకుల్ అహ్మద్‌ను అరెస్ట్ చేయగా, మరో నిందితురాలు దీక్షా తివారీ పరారీలో ఉన్నట్టు తెలిపారు పోలీసులు.
ఉద్దేశపూర్వకంగా దాడిచేసి అవమానించినట్టు తేలయడంతో ముగ్గురిపైనా నాన్-కాగ్నిజబుల్ కేసులు ఫైల్ చేశారు. దాడి చేసిన టైమ్‌లో ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నారన్నారు పోలీసులు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పురుషులకు రక్షణ కల్పించాలంటూ సెటైరికల్‌గా డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..