
వారంతా దైవ దర్శనానికి వెళ్ళారు.. అక్కడ దర్శనం అనంతరం కారులో ఇంటికి బయలుదేరారు.. ఈ క్రమంలోనే ఊహించని రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కర్నాటకలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంంలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి చెందారు.. ఈ ఘటన కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో జరిగింది. వ్యాను, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ రోడ్డు ప్రమాదంలో నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60) అక్కడికక్కడే మరణించారు. వీరంతా గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు వ్యాన్ ముందు భాగం నుజ్జు నుజ్జయింది.
సమచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..