బీఎస్ఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడ్డ బంగ్లాదేశీ దుండగులు..

వెస్ట్‌ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశీకి చెందిన కొందరు దుండగులు దాడి చేశారు. జిల్లాలోని బన్స్‌ఘటా ఔట్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై గుర్తు తెలియని బంగ్లాదేశీ..

బీఎస్ఎఫ్ జవాన్లపై దాడికి పాల్పడ్డ బంగ్లాదేశీ దుండగులు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 04, 2020 | 11:54 PM

వెస్ట్‌ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లపై బంగ్లాదేశీకి చెందిన కొందరు దుండగులు దాడి చేశారు. జిల్లాలోని బన్స్‌ఘటా ఔట్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లపై గుర్తు తెలియని బంగ్లాదేశీ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. దుండుగులు దాడి జరపుతుండటంతో.. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు.. బంగ్లాదేశీ దుండగులపై కాల్పులు జరిపారు. దీంతో దుండగులు.. బంగ్లాదేశ్‌ వైపు పారిపోయారు. ఈ విషయాన్ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. అయితే దాడికి పాల్పడింది చొరబాటు దారులా..? లేదా ఉగ్రవాదులా..? అన్నది తేలాల్సి ఉంది.