Farmers Protest: మహారాష్ట్రలోని 21 జిల్లాల నుంచి వేలాది రైతులు సముద్రంలా కదిలారు. నాసిక్ నుంచి 180 కి.మీ. దూరంలో ఉన్న ముంబైకి చేరేందుకు వారు చేతిలో పతాకాలను, బ్యానర్లను పట్టుకుని కసర్ ఘాట్ రీజియన్ ద్వారా ఉప్పెనలా ముందుకు సాగారు. ఆలిండియా కిసాన్ సభ ఆధ్వర్యాన సుమారు 30 కి పైగా సంఘాలు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో జరిగే సభలో వీరంతా పాల్గొననున్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలకు మద్దతు ప్రకటిస్తూ ఎన్సీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఇటీవల కేంద్రాన్ని తీవ్రంగా హెచ్ఛరించారు. ఢిల్లీ శివారుల్లో చలికి గజగజ వణకుతూ ఇన్ని రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, వారి సహనాన్ని పరీక్షించవద్దని ఆయన వార్ణింగ్ ఇచ్చారు. ఆయన ఇఛ్చిన పిలుపు నేపథ్యంలో ఆలిండియా కిసాన్ సభ ఈ భారీ ర్యాలీకి శ్రీకారం చుట్టింది. సింఘు బోర్డర్ లో నిరసన చేస్తున్న రైతులతో వీరు కూడా కలిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా ఢిల్లీ శివారులో ఈ నెల 26 న ట్రాక్టర్ ర్యాలీకి రైతు సంఘాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.సుమారు రెండు లక్షల ట్రాక్టర్లతో ఈ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తమయ్యాయి.
సీఎం జగన్ ఇంటికి వెళ్లే రోడ్డు వెంబడి గోడలపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రాతలు.. ఆరా తీస్తున్న పోలీసులు