Cyclone Gulab: గుబులు పుట్టిస్తున్న గులాబ్ తుఫాను.. బెంగాల్, ఒడిశా, తమిళనాడులో భారీవర్షాలు.. నీట మునిగిన తీరప్రాంతం

| Edited By: KVD Varma

Sep 28, 2021 | 9:25 AM

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏపీ , తెలంగాణ లోనే కాదు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరం లోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒడిశాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తు్న్నాయి.

Cyclone Gulab: గుబులు పుట్టిస్తున్న గులాబ్ తుఫాను.. బెంగాల్, ఒడిశా, తమిళనాడులో భారీవర్షాలు.. నీట మునిగిన తీరప్రాంతం
Cyclone Gulab
Follow us on

గులాబ్ తుఫాను: గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోనే కాదు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరం లోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒడిశాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రసిద్దమైన చిల్కా సరస్సుకు వరదపోటెత్తింది. సమీపం లోని ఆలయాలు నీట మునిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తమిళనాడులోని తీరప్రాంతంలో చాలాచోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని అలర్ మంజూరు చేశారు.

ఒడిశాలోని 10 జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రెండు ప్రాణాలు కోల్పోయాయి. ఒడిశాలో ఇప్పటివరకు 39 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. బెంగాల్ ఆమోదం కూడా హైఅలర్ అవసరం. ఒడిశా తీరాన్ని తాకిన గులాబ్ తుఫాన్ క్రమంగా బలహీనపడి బెంగాల్ తీరం వైపు కదులుతోంది. మంగళవారం నుంచి బెంగాల్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోల్‌కతా, పుర్బా, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఇటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు లో కుండపోతతో జనజీవితం అస్తవ్యస్థంగా మారింది. రాష్ట్రంలో ఏడూ జిల్లాలో భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సముద్ర తీర ప్రాంతాలలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు. కన్యాకుమారి, అరుప్పుకొట్టై, తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాలో కు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాలో పలు కాలనీలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇది కూడా చదవండి …   విశాఖ విమానాశ్రయం: విశాఖ ఎయిర్‌పోర్ట్ ప్రజల పొంచి ఉన్న ముంపు .. గంట గంటకు పెరుగుతున్న ప్రవాహం .. నీటమునిగిన రష్యవే ..

హైదరాబాద్ సిటీ పోలీస్: బయట బోరున వర్షం .. ఇంతలోనే మహిళకు పురిటి నొప్పలు .. పోలీసులు ఏం చేశారంటే ..