ఎయిర్టెల్ బంపర్ ఆఫర్… 4జీ కస్టమర్ల కోసం ఉచితంగా 11 జీబీ ఇంటర్నెట్ ఫ్రీ… అన్ లిమిటెడ్ కస్టమర్ల కోసం 6జీబీ

|

Nov 29, 2020 | 7:16 PM

ఎయిర్టెల్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. కొత్తగా 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లతో పాటు, 4జీ డివైస్‌కు అప్‌గ్రేడ్‌ అయిన కస్టమర్లకు 11 జీబీ వరకు ఇంటర్నెట్ ను ఉచితంగా అందిస్తోంది.

ఎయిర్టెల్ బంపర్ ఆఫర్... 4జీ కస్టమర్ల కోసం ఉచితంగా 11 జీబీ ఇంటర్నెట్ ఫ్రీ... అన్ లిమిటెడ్ కస్టమర్ల కోసం 6జీబీ
Follow us on

ఎయిర్టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్ ను ప్రకటించింది. మార్కెట్లోని పలు టెలికాం సంస్థలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఫ్రీ టాక్ టైం, ఫ్రీ ఇంటర్నెట్తో గాలమేస్తున్నాయి. తాజాగా ఎయిర్టెల్ సైతం వినియోగదారులకు బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా…

కొత్తగా 4జీ సిమ్ తీసుకున్న కస్టమర్లతో పాటు, 4జీకి అప్‌గ్రేడ్‌ అయిన కస్టమర్లకు 11 జీబీ వరకు ఇంటర్నెట్ ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ను ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే ఇస్తామని పేర్కొంది. అయితే ఈ 11 బీజీ డేటాను రెండు విడతల్లో పొందే అవకాశం ఉంది. అందులో తొలి విడతలో కొత్తగా 4జీ కస్టమర్‌ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే 5 జీబీ డేటా వస్తుంది. ఇక మిగితా డేటా మొత్తం ఐదు 1 జీబీ కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్‌లో క్రెడిట్‌ అవుతుంది.

కొత్త మొబైల్‌ నంబర్‌ యాక్టివేట్‌ అయిన నెల రోజుల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్‌ కావాలి. ఐదు కూపన్లు వస్తే యాప్ లో లాగిన్ అయిన తర్వాత మై కూపన్స్‌ సెక్షన్‌కు వెళ్లి క్లెయిమ్‌ చేసుకోవాలి. అయితే 1 జీబీ డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్‌ అయిన 90 రోజుల్లోగా రీడిమ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే 5 జీబీ డేటాకు బదులు 2 జీబీ డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

అన్ లిమిటెడ్ ప్యాక్ యూజర్లకు కూడా…

ఎయిర్టెల్ కూడా తన అన్‌లిమిటెడ్‌ ప్యాకేజీ తీసుకునే వినియోగదారులకు దాదాపు 6 జీబీ డేటా వరకు ఉచితంగా అందించనుంది. 84 రోజుల వాలిడిటీతో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీలను ఎంచుకునే కస్టమర్లకు 6 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
అయితే అన్ లిమిటెడ్ ప్యాకేజీలో కూడా డాటా ఒకేసారి క్రెడిట్ కాదు. వినియోగదారులు ఆరు 1 జీబీ ఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది. అలానే రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్‌ తీసుకుంటే నాలుగు కూపన్లు, రూ. 219 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ తీసుకుంటే రెండు కూపన్లు వస్తాయి. ఎయిర్టెల్ యాప్‌ ద్వారా రీఛార్జి చేయాల్సి ఉంటుంది. కొత్త 4జీ ఎయిర్టెల్ కస్టమర్‌ అయి ఉండి రూ.598 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను తీసుకుంటే మొత్తం 11 జీబీ డేటాను పొందవచ్చు.