Watch Video: లంచం అడిగినందుకు రూ.2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. అసలేం జరిగిందంటే

|

Apr 03, 2023 | 2:51 PM

లంచం అనే అవినీతి ఈ సమాజంలో రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే పని ముందుకెళ్లని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని ఓ గ్రామ సర్పంచ్ ఓ పై అధికారిని లంచం అడిగారని డబ్బులు వెదజల్లి అందిరిని ఆశ్చర్యపరిచాడు.

Watch Video: లంచం అడిగినందుకు రూ.2 లక్షలు వెదజల్లిన సర్పంచ్.. అసలేం జరిగిందంటే
Village Sarpanch
Follow us on

లంచం అనే అవినీతి ఈ సమాజంలో రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వనిదే పని ముందుకెళ్లని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మహారాష్ట్రలోని ఓ గ్రామ సర్పంచ్ ఓ పై అధికారిని లంచం అడిగారని డబ్బులు వెదజల్లి అందిరిని ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళ్తే శంబాజీనగర్ జిల్లా పులంబ్రీ పంచాయతీ సమితి పరిధిలోని గోవరాయ్ పయాగ్ అనే గ్రామానికి సర్పంచ్ మంగేష్ పాండే. అయితే ఇటీవల ఆ గ్రామానికి 20 వ్యవసాయ బావులు మంజూరయ్యాయి. ఒక్కో బావికి రూ.4 లక్షలు కేటాయించారు. ఆ బావులు ఏర్పాటు చేసే పనులు ప్రారంభించాలంటూ మంగేష్ పలుమార్లు బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ అయిన జ్యోతి కవడదేవికి విజ్ఞప్తి చేశారు.

అయితే జ్యోతి కవడదేవి మాత్రం ఒక్కో బావికి లంచంగా రూ.48 వేలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉండేవారంతా పేదవారని.. ఆ సర్పంచ్ బతిమిలాడిన ఆమె వినిపించుకోలేదు. దీంతో ఆమెపై కోపంతో రగిలిపోయిన సర్పంచ్ రూ.100, 200 నోట్లతో దాదాపు రూ.2 లక్షల దండ మెడలో వేసుకుని శుక్రవారం కార్యాలయానికి వచ్చి ఆ డబ్బులు వెదజల్లాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి గిరీష్ మహాజన్ బీడీఓ అధికారి అయిన జ్యోతి కడవదేనిని సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. అయితే ఆ డబ్బులు కూడా పేద ప్రజల నుంచే సేకరించినవేనని..ఆ మొత్తాన్ని కూడా ఆ అధికారి నుంచి వసూలు చేసి ఇప్పించాలని ఆ సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..