ఇంట్లో గొడవపడి మనోవేదనకు గురయ్యాడు.. పట్టాలపై పడుకొని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు.. అంతలోనే..

ప్రజల్లో రోజురోజుకు ఓపిక, సహనం సన్నగిల్లుతున్నాయి. చిన్న చిన్న వాటికే కోపం పెంచుకుంటున్నారు. వింత వింతగా ప్రవర్తస్తున్నారు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తండ్రి తిట్టాడనో, భార్య..

ఇంట్లో గొడవపడి మనోవేదనకు గురయ్యాడు.. పట్టాలపై పడుకొని సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు.. అంతలోనే..
Boy Rescued

Updated on: Oct 08, 2022 | 5:39 PM

ప్రజల్లో రోజురోజుకు ఓపిక, సహనం సన్నగిల్లుతున్నాయి. చిన్న చిన్న వాటికే కోపం పెంచుకుంటున్నారు. వింత వింతగా ప్రవర్తస్తున్నారు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తండ్రి తిట్టాడనో, భార్య పుట్టింటికి వెళ్లిపోయిందనో, పరీక్ష తప్పాననో ఇలా ఏదో ఒక కారణాలతో బాధపడిపోతున్నారు. డిప్రెషన్ కు లోనై ప్రాణాలూ తీసుకుంటున్నారు. కన్న వారికి కడుపుకోతను మిగిల్చుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఫిరోజాబాద్ హుమాయూన్‌పూర్ గ్రామంలో అనూజ్ అనే విద్యార్థి కుటుంబంతో కలిసి నివాసమంటున్నాడు. అతను ఐఐటీ చదువుతున్నాడు. అయితే కొన్నాళ్లుగా అతనికి, అతని తండ్రికి మధ్య గొడవ జరుగుతోంది. ఇది రోజూ నిత్యకృత్యంలా మారిపోవడంతో అనూజ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో అనూజ్‌, అతని తండ్రి మధ్య మరోసారి ఏదో విషయమై వాగ్వాదం జరిగింది. అనూజ్‌ను అతని తండ్రి మంద‌లించాడు. అనూజ్ తండ్రి మాటకు ఎదురు చెప్పడంతో ఆగ్రహించిన అతను.. అనూజ్ తో ఇంకెప్పుడు నీ మొహం చూపించొద్దు అని చెప్పాడు.

దాంతో మ‌న‌స్తాపానికి గురైన అనూజ్ సమీపంలోని ఫిరోజాబాద్ రైల్వే స్టేష‌న్‌కు వెళ్లాడు. ఓ ట్రాక్‌పై రైలు రావ‌డాన్ని గ‌మ‌నించి ప‌రుగున వెళ్లి అడ్డంగా ప‌డుకున్నాడు. అయితే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు ఈ సీన్ చూసి ఆశ్చర్యపోయారు. ట్రాక్ పై రైలు వస్తుండటాన్న గమనించి వెంటనే అలర్ట్ అయ్యారు. మిగతా ప్రయాణికులు అది గ‌మ‌నించి గ‌ట్టిగా అర‌వ‌డంతో అప్రమ‌త్తమైన రైల్వే పోలీసులు.. అనూజ్ వద్దకు వెళ్లి పట్టాలపై నుంచి ప్లాట్ ఫారమ్ పైకి చేర్చారు.

ఇవి కూడా చదవండి

తర్వాత అతని నుంచి వివరాలు తెలుసుకుని పేరెంట్స్‌ను పిలిపించి మాట్లాడారు. విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనూజ్ ఆత్మహ‌త్యాయ‌త్నం దృశ్యాలు స్టేష‌న్‌లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు అవి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..