దొరికితే దొంగ.. లేదంటే దొర.. దేశంలో అత్యధికంగా అవినీతి జరిగే ప్రభుత్వ శాఖ ఎదో తెలుసా..?

దేశంలో అవినీతిపై ఓ స్వతంత్ర సంస్థ సర్వే నిర్వహించింది. లక్షలాది మంది నుంచి వివరాలు సేకరించింది. వారిలో 51 శాతం మంది నుంచి తాము లంచం ఇచ్చామనే సమాధానం వచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపాలిటీ వంటి శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని వెల్లడించారు. మరి దేశవ్యాప్తంగా ఏయే ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

దొరికితే దొంగ.. లేదంటే దొర..  దేశంలో అత్యధికంగా అవినీతి జరిగే ప్రభుత్వ శాఖ ఎదో తెలుసా..?
Most Corrupt Government Department

Edited By: Balaraju Goud

Updated on: Nov 15, 2025 | 9:33 PM

దేశంలో అవినీతిపై ఓ స్వతంత్ర సంస్థ సర్వే నిర్వహించింది. లక్షలాది మంది నుంచి వివరాలు సేకరించింది. వారిలో 51 శాతం మంది నుంచి తాము లంచం ఇచ్చామనే సమాధానం వచ్చింది. ఆస్తి రిజిస్ట్రేషన్, పోలీస్, మున్సిపాలిటీ వంటి శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతోందని వెల్లడించారు. మరి దేశవ్యాప్తంగా ఏయే ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉందో తెలుసుకుందాం.

భారతదేశంలో స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యంత ఎక్కువగా అవినీతి జరిగే ప్రభుత్వ కార్యాలయాల జాబితాలో పోలీస్ విభాగం ముందు వరుసలో ఉందని తేలింది. దీని తర్వాత రెవెన్యూ శాఖ, మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీ, బ్లాక్ ఆఫీసులు, విద్యుత్ శాఖ, రవాణా కార్యాలయం (ఆర్టీవో), ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ, నివాస, పట్టణాభివృద్ధి, ఆదాయ పన్ను, జిఎస్‌టీ శాఖలు ఎక్కువ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

ఈ నివేదికలు ఏదో ఊరికే చెబుతున్న విషయం కాదు. పౌరుల ఫిర్యాదులు, మీడియా కథనాలు, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, లోక్‌పాల్ డేటా ఆధారంగా వెలువడినవి. అవినీతి వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ల్యాండ్ రిజిస్ట్రేషన్, ఆస్తుల మార్పిడి అంశాల్లో ఎక్కువగా ముడుపులు, లావాదేవీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకు, తెలంగాణలోని ప్రజల్లో 40% మంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఇష్యూలకు, 33% మంది మున్సిపల్ కార్యాలయాల్లో ముడుపులు చెల్లించారని సర్వేలు వెల్లడించాయి. 2023లో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి 74,203 అవినీతి ఫిర్యాదులు అందగా, ఇందులో రైల్వే ఉద్యోగులపై పదివేల 447, స్థానిక సంస్థలపై అంటే మున్సిపల్ కార్యాలయాలు గ్రామపంచాయతీలలో 7,665, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులకు 7వేల నాలుగు ఫిర్యాదులు వచ్చాయి. ఏది ఏమైనా టాప్ కరప్షన్ లిస్టులో టాప్ కరప్టెడ్ పొజిషన్ లో పోలీస్ శాఖ ఉండగా రెండవ స్థానంలో రెవెన్యూ శాఖ ఉంది.

ఈ వివరాలు నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC), ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సోర్స్‌ల ఆధారంగా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ప్రజలకు ఎక్కువగా వాడే ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..