Liquor Home Delivery: దేశంలో మద్యాన్ని ఎందుకు హోమ్ డెలివరీ ఇవ్వరో తెలుసా.. అసలు జనం ఏమి కోరుకుంటున్నారంటే..

|

May 02, 2022 | 9:30 AM

Liquor Home Delivery: ఇప్పటి వరకు ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా ఫుడ్, గ్రాసరీస్, హోమ్ నీడ్స్, ఫర్నిచర్.. ఇలా అనేక రకాల సేవలు హౌమ్ డెలివరీ అందుబాటులో ఉన్నాయి. కానీ.. దేశంలో మద్యాన్ని హోమ్ డెలివరీ ఎందుకు ఇవ్వటంలేదో తెలుసా.. కారణాలు తెలుసుకోండి..

Liquor Home Delivery: దేశంలో మద్యాన్ని ఎందుకు హోమ్ డెలివరీ ఇవ్వరో తెలుసా.. అసలు జనం ఏమి కోరుకుంటున్నారంటే..
Liquor Home Delivery
Follow us on

Liquor Home Delivery: ఇప్పటి వరకు ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా ఫుడ్, గ్రాసరీస్, హోమ్ నీడ్స్, ఫర్నిచర్.. ఇలా చెప్పుకుంటూ పోతే రోజూ ప్రజలు వినియోగించే అనేక వస్తువులు ఇంటికే నేరుగా డెలివరీ సేవలు(Online Delivery) అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు మద్యాన్ని కూడా ఇదే తరహాలో డోర్ డెలివరీ సౌకర్యం ఉంటే బాగుంటుందని దేశంలో అనేక మంది మద్యం ప్రియులు అనుకుంటున్నారు. కానీ దీనిని అమలు చేయటానికి అనేక చట్టపరమైన సమస్యలు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలోని ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌(Hyderabad)లోని దాదాపు 81% మంది వినియోగదారులు తమ రాష్ట్ర ప్రభుత్వాలు మద్యాన్ని ఇంటికి డెలివరీని అనుమతించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అసలు ఇంటికి డెలివరీ ఎందుకు కోరుకుంటున్నారని ప్రశ్నించగా.. తమకు కావలసిన బ్రాండ్ల లభ్యత, కరోనా కారణంగా సామాజిక దూరం పాటించవలసి రావటం, ఇతర సౌకర్యాలను ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పద్ధతికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా తమ అయిష్టతను కొనసాగిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ విధానంపై విముకత చూపింది.

కరోనా మహమ్మారి రాష్ట్రాలకు ఆల్కహాల్‌ను ఇంటి డెలివరీ అందించటం వల్ల ఆర్థిక ప్రయోజన కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించింది. దాని వల్ల సదరు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు అధిక పన్ను రాబడి వచ్చే అవకాశమూ ఉంది. ఆల్కహాలిక్ బెవరేజస్ పై ఎక్సైజ్ సుంకం, మద్య పానీయాలు, పెట్రో ఉత్పత్తుల అమ్మకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు VAT రూపంలో అత్యధికంగా ఆదాయం వసూలవుతుంది. వారి ఆర్థిక ప్రయోజనం కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని మద్యం డోర్ డెలివరీ అందించింది. ఇది చిల్లర వ్యాపారులకు సమానంగా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆన్‌లైన్‌లో విక్రయించే 25% కంటే ఎక్కువ ఆల్కహాల్-మాత్రమే రిటైలర్లు తమ మొత్తం అమ్మకాల్లో ఐదవ లేదా అంతకంటే ఎక్కువ ఈ-కామర్స్ నుంచి మాత్రమే సంపాదించినట్లు తెలిపారు. మద్యం ఆన్‌లైన్ డెలివరీ మహిళలు దుకాణాలకు వెళ్లినప్పుడు అనవరసరంగా అటెన్షన్ పొందకుండా కొనుగోళ్లను సులభతరం చేస్తాయి. 78% మంది మహిళలు ఇంటి డెలివరీలను అనుమతించినట్లయితే మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజకీయంగా ఎదురుదెబ్బలు తగులుతాయనే భయంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు హోమ్ డెలివరీ విధానాన్ని అమలు చేయడానికి ఇష్టపడలేదు. దీనికి తోడు తగిన ధృవీకరణ లేకపోతే ఈ పద్ధతి వల్ల తక్కువ వయస్సు ఉన్న వారు మద్యపానానికి అలవాటు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నారు. WhatsApp గ్రూప్ లలో ఆర్డర్లు స్వీకరించటం ద్వారా అనేక అనధికారిక దుకాణాలు కూడా ఆన్ లైన్ డెలివరీల ప్రయోజనాన్ని పొందుతాయి. అక్రమార్కులు ఇప్పటికే ఇలాంటి వాటిని నడుస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క మద్యం పరిశ్రమ మాత్రం వ్యక్తుల వయస్సును తనిఖీ చేసి విక్రయించేందుకు తగిన పద్ధతులు అమలులో ఉన్నాయని చెబుతోంది. ఉదాహరణకు Swiggy కస్టమర్‌ల ప్రభుత్వ IDల ద్వారా ఒక్కసారి తప్పనిసరి వయస్సు ధృవీకరణ ప్రక్రియను అనుసరిస్తోంది.

ఇవీ చదవండి.. భారతదేశంలో మద్యం హోమ్ డెలివరీ యొక్క చట్టపరమైన చిక్కులు

Crypto News: అక్కడ పోలీసులకు భారీ జీతాలు ఆఫర్ చేస్తున్న క్రిప్టో కరెన్సీ కంపెనీలు.. ఎందుకంటే..

Bank News: ఖాతాదారులకు షాకిచ్చిన HDFC బ్యాంక్.. ఆ లోన్ల వడ్డీ రేట్లు పెంపు..