ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన పరిచయం స్నేహంగా.. ఆ స్నేహం.. ప్రేమగా చిగురించింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా మారింది. పెద్దలు ఎదురుచెప్పినా, సమాజం ఒప్పుకోకున్నా కలిసి ఉండేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. కానీ.. వారి మధ్య విభేదాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎవరో ఒకరు మగవాడిగా మారాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఓ యువతి.. లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. మగవాడిగా మారింది. ఇదే సమయంలో ఆమెకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆమె పెళ్లి చేసుకున్న యువతి.. మరో యువకుడి ప్రేమలో పడింది. అంతే కాకుండా తనతో కలిసి ఉండేందుకు నిరాకరించింది. ఇక చేసేదేమీ లేక.. బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లాకు చెందిన సనా ఖాన్, సోనాల్ శ్రీవాత్సవ అనే ఇద్దరు యువతులు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసుండాలని భావించి 2017లో పెళ్లి చేసుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరిలో ఎవరో ఒకరు మగవాడిగా మారాలని సోనాల్.. సనా ఖాన్‌కు చెప్పింది. దీంతో సనా ఖాన్ఢిల్లీలో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుంది. పురుషుడిగా మారి పేరును సుహైల్ ఖాన్‌గా మార్చుకుంది. ఈ సమయంలో సోనాల్ శ్రీవాత్సవకు ఓ ఆస్పత్రిలో ఉద్యోగం వచ్చింది. అక్కడ ఆమెకు మరో అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో సోనాల్.. సనాఖాన్‌ను దూరం పెట్టేగి, ‘నేను నీతో కలిసి జీవించలేను. అంత ఇబ్బందిగా ఉంటే వెళ్లి మళ్లీ అమ్మాయిగా మారు’ అని సోనాల్‌తో చెప్పింది. దీంతో మనస్తాపానికి గురైన సనా ఖాన్ కోర్టును ఆశ్రయించింది.
మే 30, 2022 న ఆన్లైన్ ద్వారా కోర్టులో ఫిర్యాదు చేసింది. జూన్ 3 న దావా వేసింది. సనాతో పాటు మరో ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసుకుంది. విచారణకు హాజరు కావాలని సోనాల్‌కు నోటీసులు పంపింది. అయితే సోనాల్ ఆ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించింది. దీంతో కోర్టు ఆమెపై అరెస్ట్వారెంట్ జారీ చేసింది. పోలీసులు జనవరి 18న సోనాల్‌ను అరెస్ట్ చేసి.. జనవరి 19న తేదీన కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే లింగమార్పిడి కోసం రూ.6 లక్షలు ఖర్చుచేయడం గమనార్హం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…