యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భయంకరమైన సంఘటన రాజస్థాన్ లోని ఫలోడిలో జరిగింది. ఆదివారం ఒక వ్యక్తి తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. పేద కుటుంబానికి చెందిన అనామికా బిష్ణోయ్ పాపులర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ విషాద ఘటనకు సంబంధించిన ద్రుశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భర్త మహీరామ్ బిష్ణోయ్ ఈ దారుణానికి పాల్పడిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. కానీ అనామిక బిష్ణోయ్ ఎవరు, ఆమె కథ ఎందుకు ముగిసిందంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
33 ఏళ్ల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్.. సోషల్ మీడియా లో ఆమెకు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె డాన్సులు చేస్తూ.. తన రోజువారీ జీవితానికి సంబంధించిన రీల్స్ ను షేర్ చేస్తుండేది. బాధితురాలికి ఒక కుమారుడు ఉన్నాడు. అతను అప్పుడప్పుడు తన ఇన్స్టా లైవ్స్ రీల్స్ కనిపిస్తాడు. ఫలోడీ నాగ్పూర్ రోడ్డుకు సమీపంలో ఉన్న నారీ కలెక్షన్ సెంటర్లో బిష్ణోయ్ పనిచేస్తుంటాడు. ఆ మహిళ కొన్నేళ్లుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఇదిలా ఉండగా వరకట్నానికి సంబంధించిన కేసులో కూడా వీరిద్దరి మధ్య తగాదాలు మొదలైనట్టు తెలుస్తోంది.
ఈ ఘటన మొత్తం బిష్ణోయ్ షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. వైరల్ అవుతున్న సీసీటీవీ వీడియోలో ఆమె భర్త ఎక్కడి నుంచో దుకాణంలోకి వచ్చి భార్య కుర్చీలో కూర్చున్న దగ్గరికి వెళ్లాడు. మొదట ఇద్దరూ వాగ్వాదానికి దిగినట్లు కనిపించిన భర్త ఆ వెంటనే పిస్టల్ తీసి ఆమెపై పలుమార్లు కాల్పులు జరిపాడు. ఆ వీడియోలో కనిపిస్తున్నట్లుగా మహిళ మెడపై కాల్పులు జరపడంతో ఆమె అదే కుర్చీలో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం నిందితుడైన భర్త అక్కడి నుంచి పరారయ్యాడు.
#सोशलमीडिया #इंफ्ल्यूंसर का #मर्डर #सीसीटीवी में क़ैद
राजस्थान के फलोदी में नारी कलेक्शन सेंटर चलाने वाली अनामिका बिश्नोई की गोली मारकर हत्या कर दी गई. सूचना पर पहुंची पुलिस ने जब सीसीवीटी फुटेज खंगाले तो होश उड़ा देने वाला सच सामने आया. पता चला कि इस वारदात को महिला के पति… pic.twitter.com/pMWRS8SouM
— Gyanendra Shukla (@gyanu999) February 26, 2024
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.