Government Order: ఇంట్లో అగరబత్తులు, మస్కిటో కాయిల్స్ వెలిగించకూడదట.. కారణం ఇదే

|

Nov 12, 2023 | 6:31 PM

ఈ నగరానికి ఏమైంది అన్న టైటిల్ ఢిల్లీకి బాగా సూట్ అయ్యేలా ఉంది. ఒకవైపు పొగ, మరోవైపు కాలుష్యం అని వచ్చే ప్రకటనకు తగ్గట్లు దేశ రాజధాని నగరం మారిపోయింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని కాస్త ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న కాలుష్యంతో కూడిన పొగ ఢిల్లీని మరింత ప్రమాదానికి గురిచేస్తోంది. అసలే చలికాలం. ఢిల్లీలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు పడిపోతాయి.

Government Order: ఇంట్లో అగరబత్తులు, మస్కిటో కాయిల్స్ వెలిగించకూడదట.. కారణం ఇదే
The Government Has Issue Some Directives, Due To The Increase Pollution In Delhi
Follow us on

ఈ నగరానికి ఏమైంది అన్న టైటిల్ ఢిల్లీకి బాగా సూట్ అయ్యేలా ఉంది. ఒకవైపు పొగ, మరోవైపు కాలుష్యం అని వచ్చే ప్రకటనకు తగ్గట్లు దేశ రాజధాని నగరం మారిపోయింది. కాలుష్య కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని కాస్త ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న కాలుష్యంతో కూడిన పొగ ఢిల్లీని మరింత ప్రమాదానికి గురిచేస్తోంది. అసలే చలికాలం. ఢిల్లీలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు పడిపోతాయి. పొగ మంచు తీవ్రంగా కప్పేస్తుంది. అగ్నికి వాయువు తోడైనట్లు అన్న విధంగా తీవ్రమైన కాలుష్యానికి పొగ మంచు తోడైంది. దీంతో నగర వీధులన్నీ మసకబారిపోయాయి. 50 నుంచి 100 మీటర్ల పరిధిలో ఎదురుగా వస్తున్న వాహనాలు, మనుషులు కనిపించడం లేదు. దీనిని బట్టి అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం బాణా సంచా కాల్చేందుకు అనుమతులు ఇవ్వలేదు. నగర ప్రజలు ఎవరూ టపాసులు కాల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది. టపాసులు కాలిస్తే వచ్చే పొగ నుంచి కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడంతో పాటూ ఇంట్లో దోమల మందు కాయిల్స్ వెలిగించడాన్ని నిషేధించింది. అలాగే దోమల పొగ, అగరబత్తులు, కట్టెలు, ఆకులు, ప్లాస్టిక్ కాగితాలు కాల్చకుండా చర్యలు చేపట్టింది. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని సూచించింది. మాస్క్ ధరించాలని, కంటిని, నోటిని ఎప్పటి కప్పుడు గోరు వెచ్చని నీటితో శుభ్ర పరుచుకోవాలని తెలిపారు వైద్య నిపుణులు. ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తితే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, నిర్లక్ష్యం వహించవద్దని నగర ప్రజలను కోరింది.

ప్రస్తుతం ఉన్న ఢిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశ, విదేశాల నుంచి వస్తున్న పర్యాటకుల రద్దీ పూర్తిగా తగ్గినట్లు వెల్లడించారు అధికారులు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు మూసివేసి ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పాలని ఆదేశించింది ఢిల్లీ సర్కార్. పొగ వెలువడే వాహనాలను బయటకు తీసుకురాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అత్యవసరమైతే ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాను వినియోగించుకోవాలని తెలిపింది. అలాగే జాగింగ్, మార్నింగ్ వాక్ చేసేవాళ్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు డాక్టర్లు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..