Jamili Elections: జమిలి ఎన్నికలపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం జరిగింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై కమిటీ చర్చించింది. 8 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి ఎంపిక చేసిన అధిర్‌రంజన్ చౌదరి ఈ సమావేశానికి హాజరుకాలేదు.
విపక్షాలు ఒకే దేశం ఒకే ఎన్నికల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలీ ఎన్నికలపై జరుగుతున్న తొలి సమావేశం సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, న్యాయశాఖ కార్యదర్శి ఇతర నేతలు హాజరయ్యారు. ఈ హైలెవెల్ కమిటీ సమావేశంలో ఏడు కీలక అంశాలపై చర్చించింది.
ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలించి.. అందుకు ఏయే రాజ్యాంగ అధికారణల సవరణలు చెయ్యాలో, ఏయే చట్టాల సవరణ చెయ్యాలో కమిటీ అధ్యయనం చేస్తుంది. ఒకేసారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో, విడతలవారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై కమిటీ అధ్యయనం చేస్తుంది.
The first official meeting of the ‘One Nation One Election’ committee is likely to take place today under the chairmanship of former President @ramnathkovind at his residence, in Delhi. #OneNationOneElection pic.twitter.com/upoNhrrslo
— Upendrra Rai (@UpendrraRai) September 6, 2023
పరిస్థితులు అనుకూలించి ఒకేసారి ఎన్నికల వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత, మళ్లీ ఇది దెబ్బ తినకుండా తదనంతరం కూడా కొనసాగడానికి అవసరమైన చర్యలపై కూడా కమిటీ సిఫారసు చేస్తుంది. ఒకేసారి ఎన్నికలకు ఈవీఎంలు, వివి ప్యాట్ల అవసరం ఎంత? వాటితో పాటు మానవ వనరుల అవసరమెంతో కూడా స్పష్టమైన నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
జమిలి ఎన్నికల విషయంలో మరో ముందడుగు -TV9#OneNationOneElection #JamiliElections #TV9Telugu pic.twitter.com/V234bCXpYL
— TV9 Telugu (@TV9Telugu) September 6, 2023
లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు తీసుకునే అంశమై కార్యాచరణను ఈ కమిటీ సూచించే అవకాశం ఉంది.
First meeting of committee on ‘one nation, one election’ likely to take place today#OneNationOneElection #IndiaNews #NewsUpdates https://t.co/OQ8RZ0pQmD
— Mid Day (@mid_day) September 6, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..