Mobile 6G Network: Mobile 6G Network: దేశంలో 5G సేవలు ఇంకా ప్రారంభం కాలేదు. కానీ, 6G సాంకేతికతకు సన్నాహాలు మొదలైపోయాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన 6జీ టెక్నాలజీ దిశగా భారత్ కృషి చేస్తోందని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది 2023 చివరి నాటికి లేదా 2024 ప్రారంభంలో అంటే 2 సంవత్సరాలలో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ సాంకేతికతపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అవసరమైన అనుమతులు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. మేము భారతదేశంలో ఒక ప్రత్యేకమైన టెలికాం సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నాము. ఇది భారతదేశంలో తయారవ్తుతున్న టెలికాం పరికరం. ఈ పరికరం భారతదేశంలోని టెలికాం నెట్‌వర్క్‌కు సేవలు అందిస్తుంది. వచ్చే ఏడాది మూడవ త్రైమాసికం నాటికి, సాంకేతికతకు సంబంధించిన ముఖ్యమైన సాఫ్ట్‌వేర్ కూడా సిద్ధంగా ఉంటుంది. 5G స్పెక్ట్రమ్ వేలం కూడా 2022 క్యాలెండర్ సంవత్సరం రెండవ త్రైమాసికంలో జరిగే అవకాశం ఉంది. అని మంత్రి వివరించారు.
2022లో 5జి స్పెక్ట్రం వేలం..
5G స్పెక్ట్రమ్ వేలం 2022 క్యాలెండర్ సంవత్సరం రెండో త్రైమాసికంలో 5G స్పెక్ట్రమ్ వేలం కూడా జరిగే అవకాశం ఉంది. 5G స్పెక్ట్రమ్ వేలం కోసం ట్రాయ్(TRAI)కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. వారు ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి కాల వ్యవధిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఏడాది ప్రారంభంలో, టెల్కోల స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలతో పాటు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి తొమ్మిది సంస్కరణలను ఆమోదించారు.
దేశంలో 5G ట్రయల్స్ కోసం భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్-ఐడియాలకు స్పెక్ట్రమ్ కేటాయించారు. ఈ సమయంలో జియో(Jio), ఎయిర్‌టెల్(Airtel) గరిష్టంగా 1Gbps 5G వేగాన్ని సాధించాయి. మరోవైపు, 5G ట్రయల్ సమయంలో వోడాఫోన్-ఐడియా(Vodafone-Idea) గరిష్టంగా 3.5Gbps వేగాన్ని సాధించింది.
ఇవి కూడా చదవండి: INS Vela: భారత నేవీలోకి నిశ్శబ్ద ఆయుధం ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి.. మెరుపుదాడితో శత్రువుల పని పట్టేస్తుంది!
OPPO EV: ఒప్పో నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు.. భారత్‌లో ఈవీలను తీసుకురానున్న మొబైల్ కంపెనీలు!
GDP: పరుగులు తీయనున్న భారత్ జీడీపీ.. ప్రపంచ స్థాయి సంస్థల అంచానా.. ఏ సంస్థ ఎంత అంచనా వేస్తోందంటే..