Thar Desert: విస్తరిస్తున్న థార్ ఎడారి.. ఢిల్లీకి పెరగనున్న ముప్పు: రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వెల్లడి

|

Dec 20, 2021 | 2:05 PM

Thar Desert: దక్షిణ రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తోంది. ఈ కారణంగా థార్‌ ఎడారి, ఢిల్లీకి ముప్పు పెరగనుందని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ వెల్లడించింది..

Thar Desert: విస్తరిస్తున్న థార్ ఎడారి.. ఢిల్లీకి పెరగనున్న ముప్పు: రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వెల్లడి
Follow us on

Thar Desert: దక్షిణ రాజస్థాన్‌లోని థార్ ఎడారి వేగంగా విస్తరిస్తోంది. ఈ కారణంగా థార్‌ ఎడారి, ఢిల్లీకి ముప్పు పెరగనుందని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ వెల్లడించింది. అయితే ఈ థార్ ఎడారి ప్రపంచంలో 18 వ పెద్ద ఉష్ణమండల ఎడారి. ఇది 77000 చదరపు మైళ్ళు వ్యాపించి ఉంది. తూర్పులో ఆరావళి పడమరలో సింధూ నది మధ్య వ్యాపించిన ఎడారి.. దక్షిణ రాజస్థాన్ లో 4 జిల్లాల్లో 50శాతం వ్యాపించగా, ఇంకా ఎక్కువ జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. జైసల్మేర్, బార్మర్, బికనేర్, జోద్పూర్ జిల్లాలను దాటి వ్యాపిస్తున్న ఎడారి.. పాలి, నాగౌర్, ఝున్ఝును, చురు, అజ్మెర్ జిల్లాల్లో వ్యాప్తిని ఆపటానికి ఫారెస్ట్‌ అధికారులు చెట్లను నాటుతున్నారు.

ఎంత వ్యాప్తి:
– 4 జిల్లాల్లో 4.98 శాతం భూమి పూర్తి ఎడారిగా మారింది.
– మొత్తం మీద 12 దక్షిణ రాజస్థాన్ జిల్లాల్లో 14.88 మిలియన్ హెక్టార్ల భూమి ఎడారిగా మారిందని 2019 లో రిపోర్ట్.
– కొన్ని ఇసుక తిన్నెలు సంవత్సరానికి 31.7 మీటర్ల వ్యాప్తి.
– ఎడారి గాలుల వలన 64.69 శాతం, నీటి ప్రభావంతో 10 శాతం భూమి ఎడారిగా మారుతోంది.

కారణాలు:
– పెరిగిన పశుగణం – వాటి మేత కోసం పచ్చిక బయళ్లు నాశనం. 1956 నుండి 2019 వరకు 14.63 మిలియన్ పెరుగుదల.
– ఝున్ఝును, జలోర్, జోద్పూర్, బార్మర్ జిల్లాల్లో మైనింగ్
– ప్రజలు ఎడారి ప్రాంతాన్ని వదిలి వలసలు వెళ్ళటం.
– ఎడారి ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుని అతిగా నేలని దున్ని పంటలు వేసే ప్రయత్నాలు చేయటం.
– మారుతున్న వర్షపాతం.
– వ్యాప్తి చెందుతున్నఇసుక తిన్నెలు
– ఎక్కడబడితే అక్కడ ఆ ప్రాంతానికి చెందని చెట్లు పెంచటం వలన నీళ్లు అతిగా పీల్చేయటం
– మారుతున్న వాతావరణం కారణంగా ఎండిన నేల విస్తరిస్తోంది.

నష్టాలు:
– ఢిల్లీ వరకు చేరే ఇసుక తుఫానులు ఎక్కువ అవుతాయి.
– గోడగా అడ్డు ఉండే ఆరావళి కొండలు కోతకు గురయ్యే కొద్దీ ఇసుక తుఫానుల తీవ్రత పెరగనుంది.
– ఇసుక రేణువుల వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం.

ఆరావళి క్షీణించటం:
– విచ్చలవిడి మైనింగ్ కారణంగా క్షీణిస్తున్న కొండలు.
– కొండల మీద అడవులు మాయం.
– ఈ అడ్డంకి తోరాలిపోవడంతో ఢిల్లీ వరకు చేరే ఇసుక తుఫానులు.

– ప్రపంచవ్యాప్తంగా – GLASOD (Gglobal Assessment of Human Induced Soil Degradation) ప్రకారం..1990 నుండి సుమారు 2000 మిలియన్ హెక్టార్ల భూమి ఎడారిగా మారుతున్నట్లు అంచనా.
– 2015 లో 500 మిలియన్ ప్రజల మీద ప్రభావం – పంటపొలాలు దెబ్బతినటం, ఇసుక తుఫానులు, వాయు కాలుష్యం.
– 20 వ శతాబ్దంలో సహారా ఎడారి 10 శాతం వ్యాపించడం.
– ఆసియాలోని 48 దేశాల్లో 38 దేశాల మీద ప్రభావం.

ఇవి కూడా చదవండి:

Royal Enfield Classic 350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లో లోపాలు.. బైక్‌లను వెనక్కి తీసుకునేందుకు కంపెనీ నిర్ణయం!

SBI Credit Cards: ఎస్‌బీఐ నుంచి కొత్త క్రెడిట్‌ కార్డు.. వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద స్మార్ట్‌వాచ్‌..!