Nirbhaya Act: ‘నిర్భయ’ చట్టానికి పదేళ్లు.. అయినా మహిళను వదలని భయం.. మగువకు రక్షణ ఇంకెప్పుడు..?

|

Sep 15, 2021 | 9:51 PM

Nirbhaya Act: దేశంలో అడుగుకో కామాంధుడు.. గంటకో అత్యాచారం.. వావివరసలు మరిచి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఉన్న చట్టాలు చాలవని కఠిన చట్టాలు తెచ్చారు.

Nirbhaya Act: ‘నిర్భయ’ చట్టానికి పదేళ్లు.. అయినా మహిళను వదలని భయం.. మగువకు రక్షణ ఇంకెప్పుడు..?
Nirbhaya Act
Follow us on

Nirbhaya Act: దేశంలో అడుగుకో కామాంధుడు ఉన్నాడు. గంటకో అత్యాచారం జరుగుతూనే ఉంది. వయసు, వరస మరిచి మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. మరి వీటికి అడ్డుకట్ట వేయాలంటే ఉన్న చట్టాలు చాలవని కఠిన చట్టాలు తెచ్చారు. అయినా ఎందుకు ఆగడం లేదు. జాతీయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ మహిళల భద్రతకు తీసుకున్నా చర్యలు.. ఏర్పాట్లు అయిన కమిషన్లు కూడా ఎందుకు అరికట్ట లేకపోతున్నాయి… ఏం చేస్తే ఆగుతాయి.. ఎలాంటి చర్యలు తీసుకుంటే మహిళలు స్వేచ్ఛగా తిరుగుతారు…

మరో రెండు నెలల్లో డిసెంబర్‌ వస్తోంది. అంటే నిర్భయ ఘటనకు 10 ఏళ్లు. అయినా అలాంటి ఘటనలకు పుల్‌ స్టాప్‌ పడలేదు. ఇంకా ఎంతో మంది నిర్భయలు బలవుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న ముంబైలో ఓ యువతిని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హింసించి చంపేశారు. ఈ ఘటన గురించి చర్చ ముగియకముందే హైదరాబాద్‌ నడిబోడ్డున సింగరేణి కాలనీలో జరిగిన ఘటన యావత్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఆరేళ్ల చిన్నారిని చిదిమేశాడు ఓ కామాధుడు. ఇలా నిత్యం ఎన్నో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇవే కాకుండా పురుష, సమాజానికి భయపడి లోలోపల వేధనకు గురవుతున్న మహిళలు ఎందరో.. బయటకు చెప్పుకోలేక, హింసను భరించలేక చచ్చి బతుకుతున్న అబలల లెక్కే లేదు..

2012లో అత్యాచారా కేసులు 24వేల 923 అయితే… తాజాగా NCRB విడుదల చేసిన నివేదిక ప్రకారం 43వేల దాటాయి. అంటే ఈ మధ్య కాలంలో దాదాపు డబుల్‌ అయ్యాయి. పాత చట్టాలు మహిళలకు భద్రత కల్పించడం లేదని.. తెచ్చిన నిర్భయ చట్టాలు ఎందుకు కట్టడి చేయలేకపోయాయి. 2013లో కేంద్ర ప్రభుత్వం లైంగిక అత్యాచారానికి గురైన మహిళల సంరక్షణ, పునరావాసం కోసం నిర్భయ నిధిని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నాలుగేళ్లలో దానికి మరో 3వేల కోట్లను జత చేశారు. కానీ ఎంత ఖర్చు చేశారన్నది ఇప్పటికీ లెక్కలు లేవు. దిశ కేసు తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అటు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా వస్తున్న ఫిర్యాదులు వేల సంఖ్యలో ఉంటున్నాయి. పోలీసులు కేసులు పెట్టినా న్యాయం జరగలేదని ఎంతోమంది మహిళలు విమెన్‌ కమిషన్లను ఆశ్రయిస్తున్నారు.

అత్యాచారాలే కాదు… అసలు మహిళల జీవించే హక్కే ప్రశ్నార్ధకం అవుతోంది. గృహహింస, వరకట్న చావులు, ఆడపిల్ల పేరుతో భ్రూణ హత్యలు ఇలా నిరంతరం వారిపై జరుగుతున్న దాడి ఆందోళన కలిగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా నానాటికీ పెరుగుతున్న నేరాలు భయపెడుతున్నాయి. మహిళల భద్రతను పరిస్థితులు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇంకా ఎంతటి కఠిన చట్టాలు తీసుకువస్తే గానీ ఆడ బిడ్డలకు రక్షణ కల్పించలేమో అనిపిస్తుంది.

Read Also…. Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు? 

Terrorist Attack: పాకిస్తాన్ ఆర్మీపై ఉగ్రదాడి.. ఏడుగురు సైనికుల దుర్మరణం.. ఈ నెలలో ఇది రెండో దాడి!

Viral Video: పెళ్లికూతురికే లైన్‌ వేస్తూ యువకుడి డాన్స్‌.. వరుడు రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు.. వీడియో