Tej Pratap Yadav: ‘సాయిబాబా మహత్యాన్ని కనులారా చూశా’.. సంబరపడిపోతున్న తేజ్ ప్రతాప్ యాదవ్..

ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంబరపడిపోతున్నారు. ఎవరికీ దక్కని భాగ్యం తనకే దక్కిందంటూ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.

Tej Pratap Yadav: ‘సాయిబాబా మహత్యాన్ని కనులారా చూశా’.. సంబరపడిపోతున్న తేజ్ ప్రతాప్ యాదవ్..
Tej Pratap Yadav

Updated on: Oct 14, 2022 | 1:53 PM

ఆర్జేడీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సంబరపడిపోతున్నారు. భక్తి కాస్త ఎక్కువైన ఆయన.. ఎవరికీ దక్కని భాగ్యం తనకే దక్కిందంటూ ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు అంతలా సంతోష పడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. తేజ్ ప్రతాప్ యాదవ్ భగవంతుడు సాయిబాబూ మహత్యాన్ని అనుభూతి పొందారట. సాయిబాబాకు సంబంధించి ఓ సీరియస్ చూసిన తరువాత తన ఛాంబర్‌లో ‘విభూతి’ దొరికిందట. ఇదే విషయాన్ని వెల్లడిస్తూ తేజ్ ప్రతాప్ యాదవ్ ఒక వీడియోను విడుదల చేశాడు.

అవును, తనను తాను దేవుడిగా, పరమ భక్తుడిగా చెప్పుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తేజ్ ప్రతాప్.. ఇప్పుడు సాయిబాబా మహత్యం పేరుతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. సాయిబాబా తన మహత్యాన్ని చూపించారని చెప్పుకొచ్చారు. విభూతి కావాలిన కోరగానే.. తన ఛాంబర్‌లో ఒక కవర్ ప్రత్యక్షమయ్యిందని, అందులో విభూతి లభించిందని తేజ్ ప్రతాప్ పేర్కొన్నాడు. తాను ఓ సీరియల్ చూశానని, అందులో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సాయిబాబా విభూతితో ఆరోగ్యవంతులుగా చేయడం చూశానన్నారు. ఆ తరువాత తాను కూడా సాయిబాబాను స్మరించుకున్నానని చెప్పారు. తనకు కూడా విభూతి కావాలని కోరానని, మరుసటి రోజు తన ఛాంబర్‌లో ఓ కవర్ వచ్చిందని, అందులో విభూతి ఉందని వివరించారు తేజ్ ప్రతాప్.

ఇవి కూడా చదవండి

ఇలాంటి అద్భుతాన్ని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని యాదవ్ పేర్కొన్నారు. తాను సాయిబాబా ప్రసాదంగా ‘విభూతి’ని కోరగానే లభించడం గొప్ప అనుభూతిగా పేర్కొన్నారాయన. ఈ విభూతికి అద్భుత శక్తులు ఉన్నాయని, అది ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తుందని యాదవ్ చెప్పుకొచ్చారు. కాగా, ఇప్పుడు ఈయన చెప్పిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి.

తేజ్ ప్రతాప్ వీడియో..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us