Fact Check:ఆర్మీలో ఇక నుంచి ఆఫీసర్ల స్థాయి కంటే తక్కువ స్థాయి ఉద్యోగాలకు రెగ్యులర్ నియామకాలను రద్దు చేసి.. అగ్నిపథ్ పథకాన్ని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈపథకం ద్వారా ఎంపికైన యువత నాలుగేళ్ల పాటు పనిచేసిన తరువాత.. వీరిలో 25శాతం మందిని రెగ్యులర్ చేస్తారు. మిగిలిన వారు ఆర్మీ శిక్షణ పొంది ఉంటారు కాబట్టి.. వారికి త్వరగా ఉద్యోగాలు వస్తాయంటూ కేంద్రప్రభుత్వం కొత్తపథకాన్ని తీసుకొచ్చింది. ఈపథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తాయి. ఈపథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. అయినా యువత అనుమానాలను నివృత్తి చేస్తూ.. అగ్నిపథ్ పథకంపై కేంద్రప్రభుత్వం ముందుకెళ్లింది. ఈలోపు మరో ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతమైంది.
అగ్నిపథ్ పథకం లాంటి మరో పథకాన్ని ఉపాధ్యాయుల నియమకం కోసం తీసుకురానున్నట్లు.. దీనికి రాష్ట్రపతి ఆమెదం తెలిపినట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో పత్రికా సమాచార కార్యాలయం-PIB స్పందించింది. కేంద్రప్రభుత్వం వద్ద ఉపాధ్యాయుల నియామకానికి అగ్నిపథ్ లాంటి పథకం తీసుకురావాలనే ప్రతిపాదన ఏమి లేదని.. ఇది కేవలం అసత్య ప్రచారం మాత్రమేనని స్పష్టం చేసింది. అగ్నిపథ్ లో ఆర్మీ ఉద్యోగాలకు నాలుగేళ్ల సర్వీస్ ఉండగా.. ఉపాధ్యాయులకు పదేళ్ల పాటు ఉద్యోగం ఉండేలా కొత్త పథకాన్ని కేంద్రప్రభుత్వం తీసుకురాబోతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనల అములోకి రానుందని.. బీఈడీ విద్యార్థులందరికి ఒక సువర్ణావకాశం అంటూ ప్రచారం జరిగింది. ఇలాంటి సందేశాలను ఎవరూ ఫార్వర్డ్ చేయొద్దని పిఐబి విజ్ఞప్తి చేసింది. కేవలం అటువంటి ప్రచారం అవాస్తవమని.. ఎంత మాత్రం నిజం కాదని.. ఇలాంటి ప్రచారం వల్ల సామాన్య ప్రజల్లో గందరగోళం నెలకొంటుందని పిఐబి తెలిపింది.
दावा
▪️ शिक्षक भर्ती नई नियमावली को राष्ट्रपति की मंजूरी
▪️ #Agniveer की तर्ज पर शिक्षकों की भर्ती
▪️ 10 साल होगी शिक्षक की नौकरीतथ्य
✅ ये सभी दावे फर्जी हैं
✅ ऐसा कोई भी निर्णय नहीं लिया गया हैसंदिग्ध जानकारी #PIBFactCheck को भेजें
?8799711259
?socialmedia@pib.gov.in pic.twitter.com/Szz3fhcDd7— PIB Fact Check (@PIBFactCheck) August 25, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..