భారతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ టీసీఎస్ ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ ప్రస్తుతం 169.9 బిలియన్ల డాలర్లకు చేరుకున్నది. మార్కెట్ వాల్యూలో అక్సెన్చూర్‌ను టీసీఎస్ దాటివేడయం గమనార్హం. గత ఏడాది అక్టోబర్‌లోనే ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న ఐటీ కంపెనీల్లో అక్సెన్చూర్‌ను కూడా టీసీఎస్ దాటివేసింది. 2018లో మోస్ట్ వాల్యూడ్ కంపెనీల్లో ఐబీఎం టాప్‌లో ఉన్నది. ఆ కంపెనీ టీసీఎస్ కన్నా 300 శాతం అధికంగా ఉండేది. రెండవ స్థానంలో అక్సెన్చూర్ ఉండేది. 2018లోనే టీసీఎస్ కంపెనీ తన మార్కెట్ వాల్యూను 100 బిలియన్ల డాలర్లకు చేర్చింది.