Tauktae Updates: తీరం దాటే ముందు ‘తౌటే’ బీభత్సం.. ఇసుక తుపానుతో అల్లకల్లోలం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు!

|

May 18, 2021 | 7:32 AM

Tauktae Updates: నాలుగు రోజులుగా పశ్చిమ తీరప్రాంతాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ‘తౌటే’ తుపాను గుజరాత్ రాష్టంలో తీరాన్ని దాటింది. రెండు గంటల పాటు గుజరాత్ తీర ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించింది.

Tauktae Updates: తీరం దాటే ముందు ‘తౌటే’ బీభత్సం.. ఇసుక తుపానుతో అల్లకల్లోలం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు!
Tauktae Updates
Follow us on

Tauktae Updates: నాలుగు రోజులుగా పశ్చిమ తీరప్రాంతాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న ‘తౌటే’ తుపాను తీరాన్ని దాటింది. అర్ధరాత్రి సమయంలో గుజరాత్ రాష్టంలో తీరాన్ని దాటిన ‘తౌటే’.. అంతకు ముందు రెండు గంటల పాటు గుజరాత్ తీర ప్రాంతాల్లో బీభత్సాన్ని సృష్టించింది. పెనుగాలులు.. ఇసుక తుపాను.. భారీ వర్షం ముప్పేటన గుజరాత్ తీర ప్రాంతాల్ని ముంచేసింది. ఎక్కడి కక్కడ చెట్లు కూలిపోయాయి. పలు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. భావ్‌నగర్, అమ్రేలి, గిర్-సోమనాథ్, జునాగడ్ పోర్బందర్ ఈ ఐదు జిల్లాల పై తుపాను ప్రభావం బాగా కనిపించింది. ఈ ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచీ గాలులు మొదలయ్యాయి. సాయంత్రం అయ్యేసరికి గాలుల తీవ్రత పెరిగిపోయింది. ఇక తుపాను తీరం దాటే సమయానికి సరిగ్గా రెండుగంటల ముందు అక్కడ చాలా ప్రాంతాల్లో ఇసుక తుపాను కమ్మేసింది. విపరీతమైన గాలుల ప్రభావంతో ఇసుక దుమ్ము గాలిలో సుడులు తిరిగి బీభత్సం సృష్టించింది.

ఇసుక తుపాను ఎలా కదులుతోందో మీరూ చూడండి..

Tauktae Updates: ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ తుపాను భావ్‌నగర్, అమ్రేలి, గిర్-సోమనాథ్, జునాగడ్ పోర్బందర్ జిల్లాలను బాగా ప్రభావితం చేశాయి. అలాగే జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్బందర్, ఆనంద్, భారుచ్ మరియు ధోలేరాలో కూడా తుపాను బీభత్సం సృష్టించింది. ఇక్కడ రక్షణ కోసం రాష్ట్రంలో 44 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను నియమించారు. ప్రభావిత 20 జిల్లాలకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపారు. 14 జిల్లాల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇక మరోవైపు రాజస్థాన్ పైనా ఈ తుపాను ప్రభావం పడింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, ఉదయపూర్ డివిజన్లలో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని రాజస్థాన్‌లోని హెచ్చరిక వాతావరణ శాఖ హెచ్చరించింది. దుంగర్‌పూర్, బన్స్‌వారా మరియు ఇతర జిల్లాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. దుంగర్‌పూర్‌లో, గ్రామస్తులను ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని పరిపాలన విజ్ఞప్తి చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి, జలూర్, రాజ్‌సమండ్‌లలో కూడా భారీ వర్షాలకు హెచ్చరిక జారీ చేశారు. ఈ జిల్లాల్లో 60 కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పారు. ఇక ఈ తుపాను తీరం దాటినా దాని ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. మే 18, 19 తేదీల్లో జోధ్‌పూర్, బార్మెర్, భిల్వారా, టోంక్, అజ్మీర్, బన్స్‌వారా, జైపూర్, దౌసా, అల్వార్, కోటా, బుండి జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: Petrol-Diesel Rates Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే…

గుజరాత్‌లో దారుణ ఘటన.. టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ బాలుడు మృతి..వైరల్ గా మారిన బాలుడి వీడియో .:viral video.