Tamilnadu Minister: తమిళులు(Tamils) తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో ముందుంటారు. భాష, కట్టు, బొట్టు, ఆహారం, విద్య ఇలా ప్రతి సంప్రదాయాన్ని.. తాము కాపాడుకుంటూ.. తమ ముందు తరాలవారికి అందిస్తారు. తాజాగా తమిళనాడులో ప్రాచీన యుద్ధ కళా విద్యల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. కన్యాకుమారి జిల్లాలో నాగర్ కోయిల్‌లోని లెమురియా వర్మకళారి ఆదిమురై ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు మంత్రి మనో థంకరాజ్ సిలంబం హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సమాచార సాంకేతిక శాఖ మంత్రి మనో థంకరాజ్ సిలంబం సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ పోటీలను ప్రారంభించారు.
సంప్రదాయ పంచెకట్టుతో విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి మనో బరిలో దిగి కర్రసాముతో అలరించారు. మంత్రి ఎంతో వేగంగా కర్రసాము చేయడం చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. సింగిల్ హ్యాండ్, డబుల్ హ్యాండ్ విన్యాసాలతో మంత్రి మనో తంగరాజ్ ఎంతో ఉత్సాహంగా కదిలారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. కాగా, లెమురియా ఫౌండేషన్ లో ఇలాంటి ప్రాచీన యుద్ధ విద్యల్లో శిక్షణ ఇస్తూ ప్రతి ఏటా వారిమధ్య పోటీలు కూడా నిర్వహిస్తుంటారు.
நாகர்கோவில் அண்ணா விளையாட்டு அரங்கத்தில் லெமூரியா வர்மகளரி அடிமுறை உலக கூட்டமைப்பு சார்பாக நடைபெற்ற நிகழ்வில்… pic.twitter.com/KtOfAQMBim
— Mano Thangaraj (@Manothangaraj) February 27, 2022
Also Read: