ఆయనో మాజీ సీఎం.. మొన్నటిదాకా కనుసైగలతో రాష్ట్రాన్ని శాసించిన వ్యక్తి. సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన సన్నిహితుల ఇంట్లో ఏసీబీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తమిళనాట ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా మాజీ సీఎం పళనిస్వామి టార్గెట్‌గా ఏసీబీ ఎటాక్ చర్చకు దారితీసింది. ఈ దాడులు రాష్ట్రంలో సంచనలం కలిగిస్తున్నాయి. మాజీ సీఎం పళనిస్వామి సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకంగా ఏడు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడులపై ఓ వైపు ఫిర్యాదులు వస్తుండగా.. మరోవైపు విమర్శలు వినిపిస్తున్నాయి.
చెన్నై, తిరుచ్చి, సేలం, నామక్కల్, కరూర్ జిల్లాల్లో ఈ దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఏకకాలంలో దాడులు చేపట్టడంతో పళనిస్వామి వర్గీయులు ఉక్కిరిబిక్కి అయ్యారు. పళనిస్వామి సొంత జిల్లా సేలం కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఇలం గోవన్ ఇంట్లోనూ సోదాలు కొనసాగాయి. మరో వైపు.. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు చేశారు అధికారులు. తిరుచ్చి, నామక్కల్ జిల్లాల్లోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో దాడులు చేపట్టారు. పలు రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ దాడులతో పళని వర్గం ఒక్కసారిగా అప్రమత్తమైంది. వాంటెడ్‌లీగా ఏసీబీ దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు పళనిస్వామి మద్దతుదారులు. స్టాలిన్ సర్కార్ ప్రతీకార చర్యలకు దిగుతోందని పేర్కొంటున్నారు. మాజీ సీఎంను టార్గెట్ చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. దీనిపై తీవ్రంగా మండిపడుతున్నారు మాజీ సీఎం పళనిస్వామి. ఈ సోదాలపై రాష్ట్ర గవర్న్‌ర్‌కు ఫిర్యాదు చేశారు పళని. ఈ ఏసీబీ సోదాలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాల్సిందే..
Also Read..
Aamir Khan: వివాదాస్పదంగా మారిన ఆమీర్ ఖాన్ యాడ్.. బీజేపీ ఎంపీ తీవ్ర అభ్యంతరం.. కారణం అదేనా..?