
మేఘం గర్జించింది. అల్పపీడన ప్రభావంతో కుండపోత వానలు తమిళనాడును ముంచెత్తాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి వెల్లూర్, చెన్నై, నామక్కల్, తిరుచ్చి, తిరువాయూర్, కల్లకురుచితో సహా పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు పడుతున్నాయి. జోరు వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా నష్టం వాటిల్లింది. ఆయా జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. అయితే ఇంతటితో వాన ముప్పు తొలగిపోలేదని.. దీపావళి వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది వాతావరణ శాఖ. 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇక తమిళనాడు తీరానికి దగ్గరగా కేంద్రీకృతమై ఉంది అల్పపీడనం. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వానలు దంచి కొడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. మన్నారువలయగూడ, కేరళ, శ్రీలంక తీరం వైపు చేపలవేటకు వెళ్లొద్దని మత్య్సకారులను ఆదేశించారు అధికారులు.
ఇవి కూడా చదవండి: PM Modi: విదేశాల నుంచి రావడమే ఆలస్యం 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం.. ఆ అంశంపైనే చర్చ..
LPG Price Rise: దీపావళి ముందు భారీ షాక్.. పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర.. ఎంత పెరిగిందంటే..