Bagmati Express: రైలు ప్రమాదం వెనుక కుట్ర..? రంగంలోకి NIA అధికారులు..!

|

Oct 12, 2024 | 1:44 PM

Tamil Nadu Train Accident: భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కుట్ర కోణం దాగి ఉందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఒడిశాలో బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం మాదిరిగానే భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Bagmati Express: రైలు ప్రమాదం వెనుక కుట్ర..? రంగంలోకి NIA అధికారులు..!
Bagmati Express Accident
Follow us on

భాగామతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కుట్ర కోణం దాగి ఉందని రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. ఒడిశాలో బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం మాదిరిగానే భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.. దీనిపై ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. ఇప్పటికే భాగామతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై ఇప్పటికే శాఖా పరమైన విచారణ మొదలైంది. రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందనే అనుమానాల నేఫధ్యంలో అన్ని కోణాల్లనూ సమాచారం సేకరిస్తున్నారు. చెన్నైకి సమీపంలో పొన్నేరి – కవరపేట్టైకి మధ్యలో ఆగి వున్న గ్రూడ్స్ రైలును మైసూర్ – దర్భాంగ భాగామతి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న దుర్ఘటనలో 19 మంది గాయపడటం తెలిసిందే.

ప్రాణనష్టం జరగలేదు: దక్షిణ రైల్వే జీఎం

ఈ రైలు ప్రమాద ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని దక్షిణ రైల్వే జీఎం ఆర్ఎన్ సింగ్ వెల్లడించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నా.. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదన్నారు. క్షతగాత్రుల్లోనూ ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని తెలిపారు. క్షతగాత్రులు అందరూ సాయంత్రానికి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు.

ప్రస్తుతం ట్రాక్ పనులను రైల్వే శాఖ అత్యంత వేగంగా జరుగుతున్నాయి. అనేక రైళ్లను రద్దు చేశారు. తిరిగి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ రైల్వే ప్రమాదంపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. రైల్వేశాఖ ఎంప్లాయీస్ తప్పిదమా? కుట్రకోణమా? అన్న అనుమానంలో దర్యాప్తు చేస్తున్నారు. కుట్రకోణం ఉందని అనుమానం ఉండటంతో NIA దర్యాప్తు మొదలైయ్యింది. ఎన్ఐఏ అధికారులు ప్రమాద ఘటనా స్థలిని సందర్శించారు. . రైలు ప్రమాదం మానవ తప్పిదమా.. కుట్ర కోణం ఉందా అనే దానిపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు అందించాలని సేఫ్టీ అధికారులను ఎన్ఐఏ అధికారులు ఆదేశించారు. జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు.

భాగామతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద దృశ్యాలు

మైసూర్‌ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.‘మైసూర్‌ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్‌ ఘటనకు అద్దం పడుతోందన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నాకేంద్రం పాఠాలు నేర్వలేదని మండిపడ్డారు. ఎన్డీయో సర్కార్ మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు బలి కావాలి..?’ అంటూ రాహుల్‌ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.