Viral Video: సర్కార్‌ బడిలో విద్యార్ధులతో టాయిలెట్లు కడిగించిన టీచరమ్మ..? వీడియో వైరల్

సర్కార్‌ బడిలో చదువుతున్న విద్యార్ధులతో హెడ్‌మాస్టర్‌ టాయిలెట్స్‌ శుభ్రం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తీవ్ర దుమారం లేపుతోంది. ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం ఏంటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో దిగొచ్చిన అధికార యంత్రాంతం విచారణకు ఆదేశించింది. ఈ సంఘటన తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే..

Viral Video: సర్కార్‌ బడిలో విద్యార్ధులతో టాయిలెట్లు కడిగించిన టీచరమ్మ..? వీడియో వైరల్
School Toilet Cleaning Controversy

Updated on: Jul 15, 2025 | 1:31 PM

పుదుక్కోట్టై, జులై 15: తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలోని తెక్కటూర్ పంచాయతీ పరిధిలోని నమనసముద్రం రెసిడెన్షియల్ పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల వరకు ఉంది. అక్కడ మొత్తం సుమారు 30 మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇదే పాఠశాలలో గత 18 ఏళ్లుగా కళా అనే మహిళ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ స్కూల్‌ విద్యార్ధులు పాఠశాలల ఆవరణలోని టాయిలెట్లు శుభ్రం చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదికాస్తా వైరల్ కావడంతో సర్కార్‌ చర్యలకు ఉపక్రమించింది. అయితే హెడ్‌ మాస్టర్ కళా మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. పాఠశాల సిబ్బందిగా ఉన్న వీరమ్మల్, సుధ మధ్య ఘర్షణ జరుగుతుందని అన్నారు.

తనను సంప్రదించకుండా సిబ్బంది నిర్ణయాలు తీసుకోవడంపై తాను ప్రశ్నించినందుకు.. కక్ష సాధింపుగా వీరమ్మల్‌ ఉద్దేశపూర్వకంగా ఇదంతా చేసినట్లు హెడ్‌మాస్టర్‌ కళా పేర్కొన్నారు. పాఠశాలకు క్లీనర్ రాకముందే వీరమ్మల్‌ తన కొడుకుతోపాటు ఇతర విద్యార్ధులతో టాయిలెట్స్‌ శుభ్రం చేయించిందని అన్నారు. ఆపై విద్యార్ధులు టాయిలెట్లు శుభ్రం చేస్తున్న సమయంలో వీరమ్మల్‌ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు ఆరోపించారు. నిజానికి ఈ పాఠశాలలో టాయిలెట్లు శుభ్రం చేసేందుకు రాణి అనే స్థానిక మహిళను నియమించామని, ఆమె గత మూడేళ్లుగా విధులు నిర్వహిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

హెడ్‌మాస్టర్‌ కళ చెబుతున్న విషయంలో ఎంత వరకు వాస్తవం ఉందో నిగ్గు తేల్చడానికి విద్యా శాఖ అధికారులు సమగ్ర దర్యాప్తును ఆదేశించారు. మరోవైపు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో చుట్టూ అలముకున్న కథనాలపై కూడా పూర్తి దర్యాప్తు చేయాలని విద్యా శాఖ అధికారులను గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.