Gold Smuggling: త్రిల్లర్ సినిమాను మించిన ఛేజింగ్.. సముద్రం అడుగన దాచిన బంగార సీజ్..

తమిళనాడులో భారీ గోల్డ్‌ దందా గుట్టు రట్టయింది. శ్రీలంక నుంచి అక్రమంగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మండపం తీరంలో రూ.10 కోట్ల విలువైన గోల్డ్‌ సీజ్ చేశారు.

Gold Smuggling: త్రిల్లర్ సినిమాను మించిన ఛేజింగ్.. సముద్రం అడుగన దాచిన బంగార సీజ్..
Gold

Updated on: Feb 10, 2023 | 8:12 AM

తమిళనాడులో భారీ గోల్డ్‌ దందా గుట్టు రట్టయింది. శ్రీలంక నుంచి అక్రమంగా గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మండపం తీరంలో రూ.10 కోట్ల విలువైన గోల్డ్‌ సీజ్ చేశారు. మత్స్యకారులతో కలిపి ముగ్గురు అరెస్ట్ చేశారు. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంజిలిజెన్స్‌ సంయుక్త ఆపరేషన్‌లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు. శ్రీలంక నుంచి సముద్రమార్గంలో అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు కోస్ట్‌గార్డ్‌, చైన్నై డీఆర్‌ఐ శాఖ సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించింది. ఈ నెల 7 నుంచి ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఇంటర్‌సెప్టర్ బోట్ (IB) C-432లో ప్రత్యేక నిఘా బృందాన్ని మోహరించింది. గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌లో రెండు రోజులుగా నిఘా వేయగా.. ఈ నెల 8న అనుమానాస్పద పడవ కదలికలను గుర్తించారు. సముద్రంలో డైవింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించి.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..